Bhushan Kumar : ఆదిపురుష్ సినిమాపై వచ్చిన విమర్శలకు మొదటిసారి స్పందించిన నిర్మాత.. ఏమన్నాడో తెలుసా?

కొన్ని నెలల క్రితం ఆదిపురుష్ టీజర్ రిలీజ్ తర్వాత అంతా ఆదిపురుష్ సినిమాపై విమర్శలు చేశారు. తాజాగా ఆదిపురుష్ సినిమాపై వచ్చిన విమర్శలకు నిర్మాత భూషణ్ కుమార్ స్పందించారు.

Bhushan Kumar : ఆదిపురుష్ సినిమాపై వచ్చిన విమర్శలకు మొదటిసారి స్పందించిన నిర్మాత.. ఏమన్నాడో తెలుసా?

Bhushan Kumar comments on Adipurush Movie

Bhushan Kumar :  ప్రభాస్(Prabhas) హీరోగా రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్(Adipurush). కృతిసనన్(Krithisanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా నటిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్(Bollywood) దర్శకుడు ఓం రౌత్(Om Raut) ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్స్, ఓ రాముడి సాంగ్ మాత్రం జనాలకి బాగా నచ్చటంతో సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

కానీ కొన్ని నెలల క్రితం ఆదిపురుష్ టీజర్ రిలీజ్ తర్వాత అంతా ఆశ్చర్యపోయారు. రామాయణం అనుకొని గొప్పగా అనుకుంటే బొమ్మల సినిమా తీస్తున్నారు, మొత్తం గ్రాఫిక్స్ తోనే ఉంది అని, రామాయణం పాత్రలలోని కట్టు బొట్టు మార్చేశారని, అసలు ఇది రామాయణం ఏంటి అని దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. అన్ని వైపులా ఆదిపురుష్ వివాదాల్లో నిలిచింది. కొంతమంది హిందూ మనోభావాలు దెబ్బ తీశారని ఆదిపురుష్ సినిమాపై కేసులు కూడా పెట్టారు. ఇలా అనేక విమర్శలు రావడంతో సినిమాని వాయిదా వేసి మళ్ళీ VFX వర్క్స్ మొదలుపెట్టారు.

Also Read :    Maniratnam : బాహుబలి లేకపోతే పొన్నియిన్ సెల్వన్ లేదు..

తాజాగా ఆదిపురుష్ సినిమాపై వచ్చిన విమర్శలకు నిర్మాత భూషణ్ కుమార్ స్పందించారు. ఓ కార్యక్రమంలో మీడియాతో భూషణ్ కుమార్ ఆదిపురుష్ గురించి మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమాని ఈ ఏడాది ప్రారంభంలోనే రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వాళ్ళ సినిమా వాయిదా వేశాం. మళ్ళీ VFX పనులు మరింత మెరుగ్గా జరుగుతున్నాయి. భారత్ లో ఇలాంటి సినిమా మునుపెప్పుడూ రాలేదు. మార్వెల్, DC, అవతార్ లాంటి సినిమాలకు వాడే హాలీవుడ్ టెక్నాలజీ ఈ సినిమాకు వాడుతున్నాం. ఆదిపురుష్ కోసం మేము ఎంతో కష్టపడుతున్నాం. కానీ మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి. అప్పుడు నిరాశకు గురయ్యాం. విమర్శల నుంచి చాలా నేర్చుకొని సినిమాని మరింత మెరుగు పెడుతున్నాం. ప్రస్తుతం వస్తున్న సినిమా రిజల్ట్ పై మేము సంతోషంగానే ఉన్నాము అని అన్నారు. ఇక ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకి రానుంది.