Bichagadu 2: ‘చెల్లి వినవే’ పాటతో కన్నీళ్లు తెప్పిస్తున్న బిచ్చగాడు

తమిళ హీరో విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు బిచ్చగాడు-2తో మరోసారి విజయాన్ని అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.

Bichagadu 2: ‘చెల్లి వినవే’ పాటతో కన్నీళ్లు తెప్పిస్తున్న బిచ్చగాడు

Bichagadu 2 Chelli Vinave Song Heart Touching

Updated On : April 12, 2023 / 7:44 PM IST

Bichagadu 2: తమిళ హీరో విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ సినిమాతో టాలీవుడ్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. ఆ సినిమా తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తరువాత విజయ్ ఆంటోనీ నటించిన అన్ని సినిమాలను తెలుగులోనూ రిలీజ్ చేశారు. కానీ, ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ మాత్రం మిగతా సినిమాలు ఇవ్వలేదు. ఇక ఇప్పుడు చాలా సంవత్సరాల తరువాత ‘బిచ్చగాడు-2’ సినిమాతో మరోసారి మనముందుకు వస్తున్నాడు ఈ హీరో.

Bichagadu 2: అఫీషియల్.. బిచ్చగాడు 2 రిలీజ్ డేట్ వచ్చేసింది!

బిచ్చగాడు-2 సినిమాపై తెలుగుతో పాటు తమిళనాట కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాను విజయ్ ఆంటోనీ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుండి తాజాగా రెండో సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘చెల్లి వినవే..’ అంటూ సాగిన ఈ పాట అన్నాచెల్లి బంధాన్ని చాలా చక్కగా వివరించింది. ఇక ఈ పాటను అనురాగ్ కుల్కర్ణి పాడిన తీరు ప్రతిఒక్కరినీ కదిలించే విధంగా ఉంది.

Bichagadu 2: స్నీక్ పీక్ వీడియోతో మళ్లీ అంచనాలు పెంచేసిన బిచ్చగాడు..!

ఈ పాటను పూర్తి ఎమోషనల్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి విజయాన్ని అందిస్తారో చూడాలి.