Bichagadu 2: స్నీక్ పీక్ వీడియోతో మళ్లీ అంచనాలు పెంచేసిన బిచ్చగాడు..!
తమిళంలో తెరకెక్కిన ‘పిచ్చైకారన్’ తెలుగులో ‘బిచ్చగాడు’గా 2016లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్నాడు హీర విజయ్ ఆంటోని. ఇక బిచ్చగాడు తరువాత విజయ్ ఆంటోని ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు. కాగా, ఇప్పుడు ఆయన నటిస్తున్న బిచ్చగాడు-2 మూవీపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

Vijay Antony Creates Hype With Bichagadu 2 Sneak Peak Video
Bichagadu 2: తమిళంలో తెరకెక్కిన ‘పిచ్చైకారన్’ తెలుగులో ‘బిచ్చగాడు’గా 2016లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్నాడు హీర విజయ్ ఆంటోని. ఇక బిచ్చగాడు తరువాత విజయ్ ఆంటోని ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు. కాగా, ఇప్పుడు ఆయన నటిస్తున్న బిచ్చగాడు-2 మూవీపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
Bichagadu 2: బిచ్చగాడు 2 నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఏమిటో తెలుసా?
ఇక తాజాగా ఈ అంచనాలను పెంచేస్తూ ఈ సినిమాకు సంబంధించిన స్నీక్ పీక్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ స్నీక్ పీక్ వీడియోలో సినిమాలోని మొదటి నాలుగు నిమిషాలను మనకు చూపెట్టారు. ‘మనీ ఈజ్ ఇంజ్యూరియస్ టు ది వరల్డ్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమాను రూపొందించింది చిత్ర యూనిట్. ఇక ఈ స్నీక్ పీక్ వీడియోలో బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ గురించిన చర్చ సాగుతుంది. దీంతో ఈ సినిమాలో విజయ్ ఆంటోని ఓ సరికొత్త అంశాన్ని మనముందుకు తీసుకురాబోతున్నాడని అర్థమవుతోంది.
Bichagadu 2: విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు 2’ వచ్చేది అప్పుడే!
ఈ స్నీక్ పీక్ వీడియోతో ప్రేక్షకుల్లో మళ్లీ అంచనాలు పెంచేసిన విజయ్ ఆంటోనీ, బిచ్చాగాడు-2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనేది చూడాలి. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.