School Holidays : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరోసారి వరుసగా సెలవులు.. ఈనెలలో హాలిడేస్ ఎక్కువే..
School Holidays : తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు అదిరిపోయే గుడ్‌న్యూస్.

School Holidays
School Holidays : తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. మరోసారి వరుసగా సెలవులు రాబోతున్నాయి. సెప్టెంబర్ 5వ తేదీ (శుక్రవారం) నుంచి సెప్టెంబర్ 7వ తేదీ (ఆదివారం) వరకు సెలవులు (School Holidays) రానున్నాయి.
ఈ వారంలో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 5వ తేదీ మిలాద్ – ఉన్ – నబీ మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. సెప్టెంబర్ 6వ తేదీ (శనివారం) హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనాల సందర్భంగా సెలవు ప్రకటించారు. సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం కావడంతో సాధారణ సెలవు దినం. దీంతో వరుసగా మూడ్రోజులు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రానున్నాయి.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈనెల 6వ తేదీన (శనివారం) హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతోపాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులకే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులకు కూడా లాంగ్ వీకెడ్ వచ్చినట్లయింది. వరుసగా మూడ్రోజులు సెలవులు రావడంతో కుటుంబంతో, స్నేహితులతో సరదాగా గడిపేందుకు చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్లేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు.
ఇదిలాఉంటే.. ఈనెలలోనే విద్యార్థులకు దసరా సెలవులు రాబోతున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతాయి. దీంతో అదేరోజు నుంచి అక్టోర్ 3వ తేదీ వరకు మొత్తం 13రోజుల వరకు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించనుంది. ఈనెలలో 14వ తేదీ ఆదివారం సాధారణ సెలవు. అంటే సెప్టెంబర్ నెలలో మరో 12రోజులు మాత్రమే స్కూళ్లు కొనసాగనున్నాయి.