Bichagadu 2: అఫీషియల్.. బిచ్చగాడు 2 రిలీజ్ డేట్ వచ్చేసింది!
తమిళ హీరో విజయ్ ఆంటోని కెరీర్‌లో ‘బిచ్చగాడు’ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాతో విజయ్ ఆంటోనికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ‘బిచ్చగాడు’ సినిమాకు తెలుగు ప్రేక్షకులు పట్టం కట్టడంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఈ హీరో.

Vijay Antony Bichagadu 2 Release Date Locked
Bichagadu 2: తమిళ హీరో విజయ్ ఆంటోని కెరీర్‌లో ‘బిచ్చగాడు’ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాతో విజయ్ ఆంటోనికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ‘బిచ్చగాడు’ సినిమాకు తెలుగు ప్రేక్షకులు పట్టం కట్టడంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఈ హీరో.
Bichagadu 2: స్నీక్ పీక్ వీడియోతో మళ్లీ అంచనాలు పెంచేసిన బిచ్చగాడు..!
‘బిచ్చగాడు-2’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా విజయ్ ఆంటోని అనౌన్స్ చేసినదగ్గర్నుండీ ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకోగా, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ ఓ క్లారిటీ ఇచ్చేసింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ‘బిచ్చగాడు 2’ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
Bichagadu 2: బిచ్చగాడు 2 నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఏమిటో తెలుసా?
ఈ మేరకు ఓ సరికొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమాను ప్రియా కృష్ణస్వామి డైరెక్ట్ చేస్తుండగా, విజయ్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాగా ఈ సినిమా స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న ‘శాకుంతలం’తో పోటీకి దిగడంతో బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ పోటీ నెలకొంది.