Bichagadu 2: కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బిచ్చగాడు-2.. ఈసారైనా వస్తాడా..?

విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా చిత్రం ‘బిచ్చగాడు-2’ కొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు.

Bichagadu 2: కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బిచ్చగాడు-2.. ఈసారైనా వస్తాడా..?

Bichagadu 2 Movie Locks New Release Date

Updated On : April 28, 2023 / 8:23 PM IST

Bichagadu 2: తమిళంలో తెరకెక్కిన ‘బిచ్చగాడు’ అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆదరించడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

Bichagadu 2: ‘చెల్లి వినవే’ పాటతో కన్నీళ్లు తెప్పిస్తున్న బిచ్చగాడు

ఆ సినిమా తరువాత విజయ్ ఆంటోనీ చేసిన ప్రతి సినిమా కూడా తెలుగులో రిలీజ్ చేశారు. కాగా, విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా చిత్రం ‘బిచ్చగాడు-2’ను కూడా తెలుగులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

Bichagadu 2: అఫీషియల్.. బిచ్చగాడు 2 రిలీజ్ డేట్ వచ్చేసింది!

కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు. బిచ్చగాడు-2 మూవీని వేసవి కానుకగా మే 19న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. కాగా, ఈ సినిమా ట్రైలర్‌ను రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది.