BiggBoss 5 : నోటి దగ్గర కూడు లాగేసుకున్న బిగ్ బాస్..

ఈ సారి టాస్కులని ఆడాలంటే కంటెస్టెంట్స్ కొంచెం అయినా బరువు తగ్గాల్సిందేనని కండీషన్‌ పెట్డాడు బిగ్ బాస్. ఇందులో భాగంగానే కంటెస్టెంట్స్ దగ్గర ఫుడ్ ని తీసేసుకున్నాడు బిగ్ బాస్.

BiggBoss 5 :  నోటి దగ్గర కూడు లాగేసుకున్న బిగ్ బాస్..

Biggboss

BiggBoss 5 :  నాగార్జున హోస్ట్‌ చేస్తున్న రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా నడుస్తుంది. ఈ సీజన్‌ 5లో టాస్కులు కొత్త కొత్తగా ఉంటునాయి. గేమ్స్ మాత్రవి పాతవి కొత్తవి కలిపి పెడుతున్నారు. అయితే రీసెంట్ గా కొన్ని కష్టమైన టాస్కులే ఇస్తున్నారు. ఇన్ని రోజులు కెప్టెన్సీ కంటెడర్‌ టాస్క్‌లుగా చిన్న చిన్న టాస్కులు ఇచ్చినా ఇక నుంచి మాత్రం టాస్కులు చాలా కష్టంగా ఉంటాయి అని బిగ్ బాస్ తెలిపాడు. అంతే కాక ఈ సారి టాస్కులని ఆడాలంటే కంటెస్టెంట్స్ కొంచెం అయినా బరువు తగ్గాల్సిందేనని కండీషన్‌ పెట్డాడు బిగ్ బాస్. ఇందులో భాగంగానే కంటెస్టెంట్స్ దగ్గర ఫుడ్ ని తీసేసుకున్నాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న గార్డెన్‌ ఏరియాలో ఓ వేయింగ్‌ స్కేల్‌ ని ఏర్పాటు చేసి సభ్యులందరి బరువుని కొలిపించాడు బిగ్‌బాస్‌. ఆ తర్వాత వాళ్ళని అక్కడే బయట ఉంచి, పైనుంచి కింద వరకు మొత్తం కనపడకుండా పిపియి దుస్తుల్ని ధరించి మొహం కూడా కప్పేసుకొని ఉన్న కొంతమంది అజ్ఞాతవాసులని ఇంట్లోకి పంపించి కిచెన్‌లో ఉన్న ఫుడ్‌ ఐటమ్స్‌ అన్ని తీసుకెళ్లిపోయారు. దీంతో సభ్యులందరూ ఫుడ్ మాకు కావాలి అని గట్టిగా అరిచారు.

RRR : బాహుబలి కలెక్షన్స్ పై కన్నేసిన ఆర్ఆర్ఆర్

వాళ్ళు వెళ్ళిపోయాక డోర్స్ ఓపెన్ చేశారు. డోర్స్‌ ఓపెన్‌ చేసిన వెంటనే కంటెస్టెంట్స్ అందరూ పరిగెత్తుకుంటూ కిచెన్ లోకి వెళ్లారు. అక్కడ ఫుడ్ కనపడకపోయేసరికి కంటెస్టెంట్స్ వాళ్ళు దాచుకున్న ఫుడ్‌ ఐటమ్స్‌ బయటకి తీసి తినడం మొదలు పెట్టారు. ఇది బిగ్ బాస్ గమనించి ఇంట్లో మిగిలిఉన్న ఆహార పదార్థాలన్నీ, అలాగే అందరూ సీక్రెట్ గా దాచుకున్న ఫుడ్ ని కూడా తీసుకురావాల్సిందిగా కెప్టెన్‌ జెస్సిని ఆదేశించాడు బిగ్‌బాస్‌. బిగ్‌బాస్‌ ఆర్డర్‌ వేయడంతో చేసేదేమిలేక తినే తిండిని ఇచ్చేశారు కంటెస్టెంట్స్‌ అందరూ. లోబో, సన్నీ ఇంకొంతమంది కంటెస్టెంట్స్ చాటుగా తింటుండటం తో జెస్సి వాళ్ళ దగ్గరికి వెళ్లి తినే ఫుడ్ ని కూడా తీసేసుకొని బిగ్ బాస్ కి అప్పగించాడు. మళ్ళీ వీళ్ళకి ఎంత గ్యాప్ తర్వాత ఫుడ్ పెడతారో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి.