RRR : బాహుబలి కలెక్షన్స్ పై కన్నేసిన ఆర్ఆర్ఆర్

బాహుబలి రెండు పార్టులు కూడా ప్రపంచమంతటా రిలీజ్ అయి దాదాపు 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి. దీంతో తన నెక్స్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ పై అంచనాలు పెరిగాయి.

RRR : బాహుబలి కలెక్షన్స్ పై కన్నేసిన ఆర్ఆర్ఆర్

Rrr

RRR :  రాజమౌళి సినిమా అంటే పక్కా హిట్ సినిమా. తన ప్రతి సినిమాకి పెట్టిన బడ్జెట్ కంటే చాలా ఎక్కువే వసూలు చేస్తాడు. ఇక బాహుబలి అంతకుముందు వరకు ఇండస్ట్రీ హిట్స్ సాధించినా అవి తెలుగు సినీ పరిధి వరకే ఉండేవి. దాంతో తన నెక్స్ట్ సినిమాలకు ఎక్కువ ఒత్తిడి ఉండేది కాదు. కానీ బాహుబలితో లెక్కలన్నీ మారిపోయాయి. బాహుబలి రెండు పార్టులు కూడా ప్రపంచమంతటా రిలీజ్ అయి దాదాపు 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి. దీంతో తన నెక్స్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ పై అంచనాలు పెరిగాయి.

బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి నేషనల్ వైడ్ మార్కెట్ తీసుకురావడానికి తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ అంతే కాక ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం హాలీవుడ్ యాక్టర్స్ ని కూడా ఇందులో నటింపచేసాడు రాజమౌళి. దీంతో ఈ సారి రాజమౌళి గట్టిగానే గురి పెట్టాడని అర్ధమవుతుంది. ఈ సినిమాని సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. క‌రోనా వైరస్, లాక్ డౌన్ ఇవన్నీ లేకపోయి ఉంటే ఈ పాటికే సినిమా విడుదలై భారీ కలెక్షన్స్ సాధించేది. కానీ కరోనా వల్ల, థియేటర్లు సరిగా ఓపెన్ అవ్వకపోవడం వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

Bahubali : బాహుబలి కలెక్షన్స్ పై దర్యాప్తు.. ట్యాక్స్ చెల్లించలేదా??

ఇంకా సినిమా కంప్లీట్ కాక ముందే ఇప్పటికే ఈ సినిమా 700 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుందని సమాచారం. ఆడియో, శాటిలైట్, ఓటిటి, డిజిటల్ ఇలా అన్ని రైట్స్ కలిపి ఒక్క తెలుగులోనే 200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఓవర్సీస్, హిందీ, మిగిలిన రాష్ట్రాలు కలిపి మరో 500 కోట్ల వరకు ప్రీ బిజినెస్ జరిగిందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా థియేటర్ హక్కులు వేరే రాష్ట్రాల్లో పెద్ద సంస్థలు భారీ మొత్తానికి దక్కించుకున్నాయి. సినిమాపై అంచనాలు పెరగడం, ఇంత భారీగా 700 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం చూస్తుంటే జక్కన్న తాను తీసిన బాహుబలి సినిమా కలెక్షన్స్ ని తానే బద్దలు కొట్టేలా ఉన్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా 2000 కోట్ల కలెక్షన్స్ ని బీట్ చేయాలని చిత్ర బృందం గట్టిగానే ట్రై చేస్తుంది. ఇదే జరిగితే బాహుబలి క్రియేట్ చేసిన హిస్టరీ ని ఆర్ఆర్ఆర్ బద్దలు కొట్టి కొత్త చరిత్రని సృష్టిస్తుంది.