Bahubali : బాహుబలి కలెక్షన్స్ పై దర్యాప్తు.. ట్యాక్స్ చెల్లించలేదా??

ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా విషయంలో సగం డబ్బు ప్రభుత్వానికీ, డిస్ట్రిబ్యూటర్లకూ వెళ్లలేదని సజ్జల తెలిపారు. 2000 కోట్ల కలెక్షన్స్ సాధించిందని

Bahubali : బాహుబలి కలెక్షన్స్ పై దర్యాప్తు.. ట్యాక్స్ చెల్లించలేదా??

Bahubali

Bahubali :  ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి పవన్ కళ్యాణ్ స్పీచ్ పై స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. దీంట్లో భాగంగా సినిమా కలెక్షన్స్, టికెట్ల రేట్లు, బాహుబలి కలెక్షన్స్ పై మాట్లాడారు. గతంలో ఎన్టీఆర్‌ నుంచి ఏ చిన్న హీరో వరకు ఎవరి సినిమాలైనా సినిమా టికెట్‌ ధరలు ఒకేలా ఉండేవని, సినిమా బాగుంటే అదే ఎక్కువ రోజులు ఆడుతుందని అన్నారు. కానీ ప్రస్తుతం టిక్కెట్‌ ధరను 500 రూపాయల వరకు పెంచేసి వారం రోజుల్లోనే సినిమాకి పెట్టిన పెట్టుబడి మొత్తం రప్పించాలని చూస్తున్నారు అని వ్యాఖ్యానించారు.

ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా విషయంలో సగం డబ్బు ప్రభుత్వానికీ, డిస్ట్రిబ్యూటర్లకూ వెళ్లలేదని సజ్జల తెలిపారు. 2000 కోట్ల కలెక్షన్స్ సాధించిందని అందరూ అంటున్నారు. మరి అలాంటప్పుడు ట్యాక్స్ ఎంత కట్టాలి? ఎంత కట్టారు? అని ప్రశ్నించారు. అందుకే బాహుబలి సినిమా కలెక్షన్స్ పై విచారణ జరపాలి అని అన్నారు. ఈ వ్యవహారం పై దర్యాప్తు జరిపించాలి అని ప్రభుత్వాన్ని కోరతానని సజ్జల వ్యాఖ్యానించారు.

Nagababu : ఏపీ ప్రభుత్వం, పోసాని పై సెటైర్లు వేసిన మెగా బ్రదర్..

జగన్ ప్రభుత్వం పెట్టే ఆన్‌లైన్‌ టికెట్ విధానంలో ఎవరికెళ్లాల్సిన డబ్బులు వారికి వెళ్లిపోతాయి అని, ప్రభుత్వం తీసుకొచ్చే ఈ విధానం వల్ల పవన్ కళ్యాణ్ సినిమా అయినా, చిన్న హీరో సినిమా అయినా టికెట్‌ ధర ఒకేలా ఉంటుందని అన్నారు. ప్రేక్షకుడికి తక్కువ ధరకు వినోదం లభిస్తుందంటే పవన్‌ ఎందుకు వద్దంటున్నారో చెప్పాలి అని ప్రశ్నించారు.