Bigg Boss Telugu 5 రియాల్టీ షో ప్రీమియర్ డేట్.. టీవీ టైమింగ్స్, స్ట్రీమింగ్ ఫుల్ డిటైల్స్..!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ బిగ్ రియాల్టీ షోకు సమయం ఆసన్నమవుతోంది.. బిగ్ బాస్ షో, టీవీ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలేంటో ఓసారి చూద్దాం.

Bigg Boss Telugu 5 రియాల్టీ షో ప్రీమియర్ డేట్.. టీవీ టైమింగ్స్, స్ట్రీమింగ్ ఫుల్ డిటైల్స్..!

Bigg Boss Telugu 5

Bigg Boss Telugu 5 Season : తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ బిగ్ రియాల్టీ షోకు సమయం ఆసన్నమవుతోంది.. అతికొద్ది రోజుల్లోనే బిగ్ బాస్-5 సీజన్ తెలుగు రియాల్టీ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల లిస్ట్ వైరల్ అవుతోంది. స్టార్ మా బిగ్ బాస్ ఐదవ సీజన్ డేట్ ఇచ్చేసింది. బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ సెప్టెంబర్ 5 నుండి ప్రారంభం కానున్నట్టు ప్రకటించింది. ఈసారి కూడా బిగ్ బాస్ 5 సీజన్‌కు కింగ్ నాగార్జునే హోస్టుగా చేయనున్నారు. అయితే బిగ్ బాస్ షో, టీవీ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలేంటో ఓసారి చూద్దాం..

సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం :
సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు షో ప్రసారం అవుతుంది. వీకెండ్ లో శనివారం, ఆదివారం రోజున రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది.  స్టార్ మా బిగ్ బాస్ ఐదవ సీజన్ డేట్ ఇచ్చేసింది. బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ సెప్టెంబర్ 5 నుండి ప్రారంభం కానున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అందులో కింగ్ నాగ్.. బోర్ డమ్ కి గుడ్ బై, బోర్ డమ్ నుంచి ప్రీడమ్ అంటూ ప్రోమోలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్ల AV షూట్ కూడా పూర్తిఅయిపోయింది. హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లకు క్వారంటైన్ విధించనున్నారు.

ఆగష్టు 26 నుంచి సెప్టెంబర్ 3 వరకు కంటెస్టెంట్లను హైదరాబాద్ లో ఐటీసీకి చెందిన ఫైవ్ స్టార్ హోటల్లో క్వారంటైన్‌లో ఉంచనున్నారు. సెప్టెంబర్ 4 నుంచి బిగ్ బాస్ షూటింగ్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 5 నుంచి బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రసారం అవుతుంది. ఇప్పటికే స్టార్ మా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

కంటెస్టెంట్లు వీరే :
రిపోర్టు ప్రకారం.. నటి ఉమా దేవి, VJ సన్నీ, నటులు లహరి శారీ, యాంకర్ రవి, ‘జబర్దస్త్’ ఫేమ్ ప్రియాంక, కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్, RJ కాజల్, నటుడు మానస్, నటుడు-నిర్మాత & కొరియోగ్రాఫర్ ఆట సందీప్, కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్, నటుడు దీపక్ సరోజ్, యాంకర్ వర్షిణి, యాంకర్ లోబో, యూట్యూబర్ సరయు, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, నటి ప్రియా, నటి శ్వేత వర్మ, నటి సిరి హనుమత్, షోలో పాల్గొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బిగ్ బాస్ షో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
టీవీ సిరీస్ ఛానల్, స్టార్ మాలో ప్రసారం అవుతుంది. అలాగే Disney+Hotstarలో కూడా ప్రసారం అవుతుంది.