By Election: ఉప ఎన్నికల్లో కూడా కనిపించని బీజేపీ.. ఆప్, బీజేడీ, ఎస్పీ హవా

ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్ పోటీ చేసింది. చాన్బే నియోజకవర్గంలో సమాజ్‭వాదీ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉండగా.. సౌర్ నియోజకవర్గంలో అప్నాదళ్ అభ్యర్థి ఆధిక్యం సాగిస్తున్నారు. ఇక ఒడిశాలోని జర్సుగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార బిజూ జనతా దళ్ ఆధిక్యం సాగిస్తోంది

By Election: ఉప ఎన్నికల్లో కూడా కనిపించని బీజేపీ.. ఆప్, బీజేడీ, ఎస్పీ హవా

Jalandhar: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే మూడు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‭సభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పటికి విడుదలైన ఫలితాల ప్రకారం.. కర్ణాటక అసెంబ్లీలో అధికార భారతీయ జనతా పార్టీ వెనుకంజలో ఉంది. ఇక ఉప ఎన్నికల ఫలితాల్లోనూ కమలం పార్టీకి అదే పరిస్థితి ఎదురైంది. రెండు స్థానాల్లో ఆ పార్టీ వెనుకంజలో ఉంది. ఇందులో ఒక స్థానంలో బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్ పార్టీ ముందంజలో ఉండడం గమనార్హం. యూపీలోని చౌన్బే, సౌర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగ్గా.. ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేయలేదు.

Karnataka Polls: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ముఖ్య నేతల పరిస్థితి ఏంటంటే?

ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్ పోటీ చేసింది. చాన్బే నియోజకవర్గంలో సమాజ్‭వాదీ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉండగా.. సౌర్ నియోజకవర్గంలో అప్నాదళ్ అభ్యర్థి ఆధిక్యం సాగిస్తున్నారు. ఇక ఒడిశాలోని జర్సుగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార బిజూ జనతా దళ్ ఆధిక్యం సాగిస్తోంది. ఈ స్థానంలో పోటీ చేసిన బీజేపీ వెనుకంజలో ఉంది. ఇక పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లోక్‭సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ హవా కొనసాగిస్తోంది. ఈ నియోకవర్గ ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు వెనుకంజలో ఉన్నాయి.