Presidential Election: రాష్ట్రపతి ఎన్నిక కోసం బీజేపీ కమిటీ ఏర్పాటు

రాష్ట్రపతి ఎన్నిక తీరు, ప్రచారం, సమన్వయం వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక కోసం బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.

Presidential Election: రాష్ట్రపతి ఎన్నిక కోసం బీజేపీ కమిటీ ఏర్పాటు

Presidential Election

Presidential Election: వచ్చే నెలలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నిర్వహణ కమిటీని ప్రకటించింది బీజేపీ. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో 14 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో గజేంద్ర సింగ్ షెకావత్‌ కమిటీ కన్వీనర్‌గా, వినోద్ తావ్డే, సి.టి.రవి కో కన్వీనర్లుగా ఉంటారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, శర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘవాల్, భారతి పవార్, తరుణ్ చుగ్, డీకే అరుణ, రీతూ రాజ్ సిన్హా, వనతి శ్రీనివాసన్, సంబిత్ పాత్ర, రాజ్ దీప్ రాయ్ సభ్యులుగా ఉంటారు.

Agnipath: ‘అగ్నిపథ్’పై యువతకు సరైన సమాచారం లేదనుకుంటున్నా: ఆర్మీ చీఫ్ జనరల్

రాష్ట్రపతి ఎన్నిక తీరు, ప్రచారం, సమన్వయం వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక కోసం బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. మరోవైపు ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థి కోసం వెతుకుతున్నాయి. కాగా, ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరపాలని బీజేపీ భావిస్తోంది. త్వరలోనే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.