Uttarakhand CM: ఉత్తరాఖండ్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ: సోమావారం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం

ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే విషయమై సోమావారం సాయంత్రం డెహ్రాడూన్ లో ఉత్తరాఖండ్ బీజేపీ శాసనసభా పక్ష సమావేశం కానున్నది

Uttarakhand CM: ఉత్తరాఖండ్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ: సోమావారం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం

Bjp Uk

Uttarakhand CM: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో జయభేరి మోగించిన బీజేపీ, ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపికపై స్పష్టత రాలేకున్నది. ఉత్తరప్రదేశ్, మణిపూర్ లలో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం గోవా, ఉత్తరాఖండ్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడుతుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే విషయమై సోమావారం సాయంత్రం డెహ్రాడూన్ లో ఉత్తరాఖండ్ బీజేపీ శాసనసభా పక్ష సమావేశం కానున్నది.

Also Read:PM Modi : ప్రధాని మోదీని కలిసిన ఆస్ట్రేలియా ప్రధాని.. భారత్ లో రూ.1500 కోట్ల పెట్టుబడులు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి హాజరుకానున్నారు. సమావేశ సందర్భంగా ఎమ్మెల్యేలు ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు 47 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ, అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఓడిపోవడంతో ఆస్థానంపై ఉత్కంఠ నెలకొంది. ఈక్రమంలో ముఖ్యమంత్రి రేసులో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అనిల్ బలూనీ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మదన్ కౌశిక్, కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, ఎమ్మెల్యే రీతు ఖండూరి, నైనిటాల్ ఎంపీ అజయ్ భట్ పేర్లు వినిపిస్తున్నాయి.

Also Read: Gulam Nabi Azad: కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రజల మధ్య విబేధాలు సృష్టిస్తున్నాయి: ఆజాద్

సోమవారం ఉదయం 11 గంటలకు డెహ్రాడూన్‌లోని విధానసభలో జరిగే కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం..బీజేపీ ఎమ్మెల్యేలు తమ సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. ఇదిలాఉంటే ఉత్తరాఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుపై అమిత్ షా నివాసంలో మంతనాలు జరిపిన జెపి నడ్డా, బిఎల్ సంతోష్,ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ,ఉత్తరాఖండ్ బిజెపి చీఫ్ మదన్ కౌశిక్ లు సాయంత్రం జరిగే బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిని నిర్ణయిస్తామని ప్రకటించారు.

Also Read: Bhagwant Mann: ఎమ్మెల్యేల రికమండేషన్లు చేయడానికి వీల్లేదు – సీఎం