Gulam Nabi Azad: 1990 కశ్మీర్‌ నరమేధానికి పాక్ ఉగ్రవాదులే కారణం : ఆజాద్

కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబి ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లో విబేధాలు సృష్టిస్తున్నాయని ఆజాద్ అన్నారు

Gulam Nabi Azad: 1990 కశ్మీర్‌ నరమేధానికి పాక్ ఉగ్రవాదులే కారణం : ఆజాద్

Ghulam

Gulam Nabi Azad: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబి ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లో విబేధాలు సృష్టిస్తున్నాయని ఆజాద్ అన్నారు. ఆదివారం జమ్మూలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1990లో కాశ్మీరీ పండిట్ల వలసలు మరియు హత్యలను ప్రస్తావిస్తూ, లోయలో జరిగిన అన్నింటికీ పాకిస్తాన్ పెంచిపోషించిన ఉగ్రవాదమే కారణమని ఆజాద్ అన్నారు. కాశ్మీరీ పండిట్ల ఊచకోతపై “ది కాశ్మీర్ ఫైల్స్” చిత్రం ఇటీవల విడుదలైన నేపథ్యంలో ఆజాద్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశంలోని రాజకీయ పార్టీలు మతం, కులం వర్గం వంటి విషయాల ఆధారంగా నిత్యం ప్రజల మధ్య విభజన సృష్టిస్తున్నాయని, ఆ విషయంలో తమ కాంగ్రెస్ పార్టీ సహా ఏ పార్టీని క్షమించనని ఆజాద్ అన్నారు.

Also Read: General Strike : మార్చి28, 29 తేదీల్లో ట్రేడ్ యూనియన్స్ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

మహాత్మా గాంధీ అతిపెద్ద హిందువు మరియు లౌకికవాది అని ఈ సందర్భంగా ఆజాద్ గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన దానికి పాకిస్తాన్ మరియు ఉగ్రవాదులే బాధ్యత. హిందువులు, కాశ్మీరీ పండిట్లు, ముస్లింలు, డోగ్రాలతో సహా జమ్మూ కాశ్మీర్‌లోని అందరినీ ఈఘటనలు ప్రభావితం చేసాయి” అని ఆజాద్ తెలిపారు. పౌర సమాజం కలిసి ఉండాలి, కుల, మతాలకు అతీతంగా అందరికీ న్యాయం జరగాలని ఆజాద్ ఆకాంక్షించారు. మరోవైపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ “ది కాశ్మీర్ ఫైల్స్” చిత్రానికి మద్దతు తెలిపారు. సినిమాను కూడా అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Indian – Japan: జపాన్ ప్రధాని భారత్ పర్యటన: రెండో రోజు యుక్రెయిన్, చైనా అంశాలపై చర్చ