Minister KTR : ‘నా పిల్లలపై బీజేపీ మీడియా థర్డ్‌ గ్రేడ్‌ నేతలు నీచమైన వ్యాఖ్యలు’ : మంత్రి కేటీఆర్

క్యూ న్యూస్‌ ఛానల్‌ యూట్యూబ్‌లో నిర్వహించిన ఓ పబ్లిక్‌ పోల్‌లో తన కొడుకు పేరును ప్రస్తావిస్తూ.. బాడీ షేమింగ్ చేయడంపై మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Minister KTR : ‘నా పిల్లలపై బీజేపీ మీడియా థర్డ్‌ గ్రేడ్‌ నేతలు నీచమైన వ్యాఖ్యలు’ : మంత్రి కేటీఆర్

Ktr

Minister KTR Fire as Twitter platform : సోషల్‌ మీడియా సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిందని ట్విట్టర్‌ వేదికగా తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. బీజేపీ మీడియా థర్డ్‌ గ్రేడ్‌ నాయకులు తన పిల్లలపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. వాక్‌ స్వాతంత్ర్యం ఉందని… భావ వ్యక్తీకరణ పేరుతో ఇతరులపై ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేయడం సరికాదన్నారు. కంట్రోల్‌ తప్పితే తాము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు.

జర్నలిజం ముసుగులో అర్థం పర్థం లేని విషయాలు బయట పెట్టే చెత్త యూట్యూబ్ ఛానల్స్… పిల్లలను పాలిటిక్స్‌లోకి లాగడం సమంజసమేనా అని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా బీజేపీ నేతలకు నేర్పిన సంస్కారం ఇదేనా?.. రాజకీయాల్లోకి నా కుమారుడిని లాగడం సరైనదేనా అని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే మోదీ, అమిత్ షా కుటుంబాలను లాగితే ఊరుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు.

Covid-19 : భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నాలుగు వారాలుగా 10 వేలకు పైగా నమోదు

క్యూ న్యూస్‌ ఛానల్‌ యూట్యూబ్‌లో నిర్వహించిన ఓ పబ్లిక్‌ పోల్‌లో తన కొడుకు పేరును ప్రస్తావిస్తూ… బాడీ షేమింగ్ చేయడంపై కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి చూసినప్పుడు తాను ప్రజా జీవితంలో ఉండడం కరెక్టేనా అని అనిపిస్తుందన్నారు. సోష‌ల్‌మీడియా కాలంలో ఎవ‌రు ఎవ‌రిపైనైనా ఎలాంటి రుజువులు లేకుండా బుర‌ద‌జ‌ల్లుతున్నార‌ని మండిప‌డ్డారు. ఇలాంటి దిగజారుడు పరిస్థితుల్లో ప్రజా జీవితంలో ఉండటం సబబేనా అనిపిస్తోందంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.