Karnataka Polls: బీజేపీకి షాకిచ్చిన ఎమ్మెల్సీ.. పదవికి, పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‭లో చేరిక

ఎమ్మెల్సీ పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి పుట్టణ్ణ రాజీనామా చేసిన వెంటనే బెంగళూరు కేపీసీసీ కార్యాలయానికి చేరుకుని పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ రణదీప్‏సింగ్‌ సుర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్షనేత సిద్దరామయ్యలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Karnataka Polls: బీజేపీకి షాకిచ్చిన ఎమ్మెల్సీ.. పదవికి, పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‭లో చేరిక

BJP MLC Puttanna joins Congress ahead of state assembly polls

Karnataka Polls: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్నా కొద్ది రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. తాజాగా భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్సీ పుట్టణ్ణ షాకిచ్చారు. ఎమ్మెల్సీ పదవికి, బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మర్నాడే పుట్టణ్ణ అదే బాటలో పయనించడం గమనార్హం. ఎన్నికల సమయానికి కమల నేతలు కాంగ్రెస్ వైపుకు వస్తారని కొంత కాలం క్రితం విపక్ష నేత సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలు చూస్తుంటే అదే జరుగుతున్నట్లు అనిపిస్తోంది.

Bihar: ఆవు మాంసం తరలిస్తున్నాడన్న అనుమానంతో వ్యక్తిపై భీకర దాడి, వ్యక్తి మృతి

ఎమ్మెల్సీ పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి పుట్టణ్ణ రాజీనామా చేసిన వెంటనే బెంగళూరు కేపీసీసీ కార్యాలయానికి చేరుకుని పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ రణదీప్‏సింగ్‌ సుర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్షనేత సిద్దరామయ్యలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం వారి సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక బీజేపీ మీద, బొమ్మై ప్రభుత్వం మీద ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వంలోని 40 శాతం కమిషనుతో తాను ఎంతగానో కలత చెందానని ఆయన అన్నారు.

Oscars 2023: ఆస్కార్ వేదికపై ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రసంగం.. ‘నో’ చెప్పిన అకాడమీ!

‘‘రాష్ట్రంలోని 40 శాతం కమీషన్‌ వ్యవహారంతో కలత చెందాను. అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నాను’’ అని కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం పుట్టణ్ణ స్పష్టం చేశారు. పుట్టణ్ణ కాంగ్రెస్‏లో చేరాలని తీసుకున్న నిర్ణయాన్ని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ స్వాగతించారు. విద్యారంగానికి పుట్టణ్ణ గణనీయ సేవలందించారని ఆయన పొగిడారు. పుట్టణ్ణ చేరికతో కొన్ని చోట్ల కాంగ్రెస్‌ కార్యకర్తలలో అసంతృప్తి ఉందని పరస్పరం చర్చలతో వారి అనుమానాలు నివృత్తి చేస్తామని డీకే శివకుమార్ అన్నారు.