Bandi Sanjay Kumar : నేటితో 100 కి.మీ పూర్తి చేసుకోనున్న బండి పాదయాత్ర

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర తొమ్మిదవ రోజు ఇవాళ ఉదయం జోగులాంబ గద్వాల జిల్లా పెద్దచింత రేవుల స్టేజ్ వద్ద నుండి ప్రారంభమవుతుంది.

Bandi Sanjay Kumar : నేటితో 100 కి.మీ పూర్తి చేసుకోనున్న బండి పాదయాత్ర

Bandi Sanjay Kumar

Updated On : April 22, 2022 / 9:03 AM IST

Bandi Sanjay Kumar :  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర తొమ్మిదవ రోజు ఇవాళ ఉదయం జోగులాంబ గద్వాల జిల్లా పెద్దచింత రేవుల స్టేజ్ వద్ద నుండి ప్రారంభమవుతుంది.

భీమ్‌పూర్ స్టేజి, చింతరేవుల,జూరాల  డ్యామ్ మీదుగా నందిమల్ల వరకు మొత్తం 16.1 కి.మీ పాదయాత్ర ఇవాళ సాగుతుంది.  భీమ్ పూర్ స్టేజి వద్ద మధ్యాహ్న భోజనానికి విరామం ఇస్తారు.
Also Read : Drugs Case : బంజారాహిల్స్ డ్రగ్స్ కేసు-బెయిల్ పిటీషన్ కొట్టివేత
ఇవాళ్టితో పాదయాత్రం 100 కిమీ మార్కును దాటుతుంది. నందిమల్ల పాదయాత్ర శిబిరంలో రాత్రి బస చేయనున్నారు. కాగా… నేటితో గద్వాల నియోజకవర్గంలో ప్రజా సంగ్రామ యాత్రముగియనుంది.