War In Ukraine : ఎలాంటి భయం అవసరం లేదు..భారతీయులను క్షేమంగా తీసుకొస్తారు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా అన్ని దేశాల విజ్ఞప్తి మేరకు రష్యా స్పందించిందన్నారు. సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో...

War In Ukraine : ఎలాంటి భయం అవసరం లేదు..భారతీయులను క్షేమంగా తీసుకొస్తారు

TG BJP

BJP’s Bandi Sanjay Kumar Appeals To EAM : రష్యా దాడులతో యుక్రెయిన్ దేశం వణుకుతోంది. రష్యా ఆర్మీ చేస్తున్న దాడులను యుక్రెయిన్ ప్రతిఘటిస్తోంది. అక్కడి సైన్యం కాల్పులు చేస్తూ.. వారిని అరికట్టే ప్రయత్నం చేస్తోంది. పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకొనేందుక రష్యా ఆర్మీ ముందుకు దూసుకెళుతోంది. దాడుల కారణంగా.. ఎంతో మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొంత మంది క్షణంక్షణం భయపడుతూ కాలం వెళ్ల దీస్తున్నారు. ప్రధానమైన విషయం యుక్రెయిన్ లో భారతీయులు చిక్కుకపోయారు. అందులో తెలుగు వారు కూడా ఉన్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. 2022, ఫిబ్రవరి 25వ తేదీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

Read More : Ukraine-Russia War: ‘యుక్రెయిన్‌ కోసం ఆయుధాలు పట్టనున్న ‘బాక్సింగ్‌ లెంజెండ్ బ్రదర్స్‌’

యుక్రెయిన్ లో ఉన్న 20 వేలకు పైగా భారతీయుల ఇబ్బందులను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ వెంటనే అక్కడి పరిస్థితులను సమీక్షించి, భారతీయులను కాపాడే చర్యలు మొదలుపెట్టారని వెల్లడించారు. గురువారం రాత్రి 2 గంటల వరకు తాను కరీంనగర్ నుంచి యుక్రెయిన్ వెళ్లిన పలు విద్యార్థుల కుటుంబాలను కలిసి, వారికి భరోసా కల్పించినట్లు చెప్పారు. పలువురు విద్యార్థులతో నేరుగా వీడియో కాల్ లో మాట్లాడినట్లు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా అన్ని దేశాల విజ్ఞప్తి మేరకు రష్యా స్పందించిందన్నారు. సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో దాడులు చేయడం లేదని రష్యా హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Read More : Russian Forces : చివరి దశకు యుక్రెయిన్ ఆక్రమణ.. కీవ్‌లో ప్రవేశించిన రష్యా బలగాలు

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. భారతీయులను క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని, ఈ విషయాన్ని వారికి చెప్పాలని మోదీ స్పష్టంగా తనకు చెప్పినట్లు తెలిపారు. రాష్ట్ర పార్టీ తరఫున టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు, తమకొచ్చిన నెంబర్లకు వీడియో కాల్ చేసి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అక్కడ భయానక వాతావరణం ఉన్నట్టు సోషల్ మీడియాలో ఎవరూ దుష్ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు బండి సంజయ్ కోరారు. ఇక యుక్రెయిన్ పరిస్థితికి వస్తే.. రష్యా ఆర్మీ ముందుకు వెళుతోంది. అక్కడి ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. వైమానిక దళం సపోర్టుతో రష్యన్ ఆర్మీ అత్యంగా వేగంగా దూసుకొచ్చింది. బెలారస్ నుంచి చెర్నోబిల్ వైపు దండెత్తింది. చెర్నోబిల్ కేంద్రంగానే కీవ్ వైపు రష్యన్ ఆర్మీ కదులుతోంది. కీవ్ సిటీలోకి రష్యా బలగాలు ఎంట్రీ ఇచ్చాయి. ఈ వార్ లో చెర్నోబిల్ కీలకంగా మారింది. అన్ని దేశాలు చెత్తులు ఎత్తేసినా…యుక్రెయిన్ రష్యాపై ఒంటరిపోరాటం చేస్తోంది.