Bloody Mary: డేట్ ఫిక్స్ చేసుకున్న బ్లడీ మేరీ.. ఎప్పుడంటే..?

టాలీవుడ్ అందాల భామ నివేదా పేతురాజ్ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు బ్లాక్‌బస్టర్.....

Bloody Mary: డేట్ ఫిక్స్ చేసుకున్న బ్లడీ మేరీ.. ఎప్పుడంటే..?

Bloody Mary Locks Ott Release Date

Bloody Mary: టాలీవుడ్ అందాల భామ నివేదా పేతురాజ్ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో మంచి గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించిన ఈ బ్యూటీ.. హీరోయిన్‌గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే తాజాగా నివేదా పేతురాజ్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘బ్లడీ మేరీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది.

Nivetha Pethuraj : నివేదా నాన్‌స్టాప్‌గా.. 48 గంటలు నిద్రపోతుందట..

దర్శకుడు చందు ముండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాను వెబ్ మూవీగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా కోసం చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను నేరగా ఆహాలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. అయితే పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో నివేదా పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో ఆమె ఓ అంధురాలిగా కనిపిస్తుందని.. తన అంగవైకల్యాన్ని అధిగమించి, తనకు కావాల్సిన వారిని ఆమె ఎలా కాపాడుకుంటుంది అనేది ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.

Nivetha Pethuraj : నివేదా పేతురాజ్ బ్యూటిఫుల్ పిక్స్..

చందు ముండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఆహాలో ఏప్రిల్ 15న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో బ్రహ్మాజీ, అజయ్, కిరీటి, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించాడు. మరి బ్లడీ మేరీ చిత్రంతో నివేదా పేతురాజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.