Kartik Aaryan : మొత్తానికి బాలీవుడ్ హిట్ కొట్టింది.. చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌లో 100 కోట్ల సినిమా..

గత కొన్ని రోజులుగా సౌత్ ఇండియా సినిమాలు బాలీవుడ్ లో సత్తా చాటుతుంటే బాలీవుడ్ స్టార్ లంతా అక్కడి ఆడియన్స్ ను.........

Kartik Aaryan : మొత్తానికి బాలీవుడ్ హిట్ కొట్టింది.. చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌లో 100 కోట్ల సినిమా..

Bhool Bhulaiyaa2

Bollywood :  గత కొన్ని రోజులుగా సౌత్ ఇండియా సినిమాలు బాలీవుడ్ లో సత్తా చాటుతుంటే బాలీవుడ్ స్టార్ లంతా అక్కడి ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయలేక పోయారు. వచ్చిన ప్రతి సినిమా అపజయాన్ని మూట కట్టుకుంది. కాని తాజాగా యువ హీరో కార్తిక్ ఆర్యన్ మాత్రం తన సినిమాతో భారీ వసూళ్లు సాధించి చాలా కాలం తర్వాత ఒక మంచి హిట్ ఇచ్చి బాలీవుడ్ కి ఊరటనిచ్చాడు.

ఫ్యాన్ మేడ్ స్టార్ గా ప్రకటించుకున్న కార్తిక్ ఆర్యన్ సూపర్ స్టార్ గా ఎదిగిపోయాడా అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్ ఆడియన్స్ అండ్ ఫిలిం క్రిటిక్స్. బాలీవుడ్ ఆశగా ఎదురు చూస్తున్న భారీ విజయం కార్తిక్ ఆర్యన్ భూల్ బులయ్యా 2తో అందించాడు. ఉత్తరాదిలో సౌత్ ఇండియా సినిమాలు చేస్తున్న కలెక్షన్ల దాడికి అక్కడి స్టార్ హీరోలే కంగారు పడుతుంటే ఫ్యాన్ మేడ్ స్టార్ లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ తో క్రమంగా కెరీర్ ను బిల్డ్ చేసుకుంటున్న కార్తిక్ ఆర్యన్ భూల్ బులయ్యా2తో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.

దాదాపు 75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన భూల్ భులయా2 ఒక హార్రర్ కామెడి మూవీ. ఇందులో కార్తిక్ ఆర్యన్ సరసన కియారా అద్వాని నటించింది. టబు ముఖ్యపాత్రలో నటించింది. ఈ సినిమా వారం క్రితం మే 20న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా డే వైజ్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ డే పదమూడున్నర కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్ తో యావరేజ్ గా స్టార్ట్ అయి వసూళ్ల పరంగా వృద్ధిని సాధించి, వారం రోజుల్లోనే 100 కోట్లకు చేరుకుంది. సెకెండ్ వీక్ లోనూ కలెక్షన్స్ స్థిరంగా ఉండే ఛాన్స్ ఉంది. దీంతో ఈ సినిమా టీమ్ తో పాటు, కార్తిక్ ఆర్యన్ అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

Venkatesh-Varun Tej : F3 మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్

ధమాకా తర్వాత కరణ్ జోహార్ మూవీ దోస్తాన 2లో జాన్వీ కపూర్ కి జోడిగా కార్తిక్ ఆర్యన్ లీడ్ రోల్ ఉంటుందని గతంలో వార్తలొచ్చాయి. కాని, అనూహ్యంగా ఆ సినిమా నుంచి కార్తిక్ ను తప్పించారు కరణ్ జోహార్. దాంతో కార్తిక్ ఫ్యాన్స్, సినిమా బాగుండటంతో ఆడియన్స్ కూడా కార్తిక్ ఆర్యన్ నటించిన భూల్ భులయ్యా సీక్వెల్ కి బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్నందించారు. భారీ విజయం దక్కడంతో కార్తిక్ తన హ్యాపీనెస్ ను షేర్ చేసుకోవడానికి ఫ్యాన్స్ తో గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాడని తెలుస్తోంది.