Bollywood : రేవ్ పార్టీ కేసు, సమీర్ వాంఖెడే ఎవరో తెలుసా ?

ఎన్ సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే ఎవరు ? అనే దానిపై ఇంటర్నెట్ లో ప్రజలు ఆరా తీయడం మొదలు పెట్టారు. క్రమశిక్షణ కలిగిన నిజాయితీపరుడైన అధికారిగా ఆయన పేరు ఉంది.

Bollywood : రేవ్ పార్టీ కేసు, సమీర్ వాంఖెడే ఎవరో తెలుసా ?

Drug

Bollywood Rave Party : బాలీవుడ్‌ను షేక్ చేసిన క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసుపై విచారణ కొనసాగిస్తున్నారు ఎన్సీబీ అధికారులు. ఈ కేసుతో సంబంధం ఉన్న బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ ప్రస్తుతం ఎన్సీబీ కస్టడీలో ఉన్నారు. రాత్రి అతనితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ అధికారులు.. షిప్‌లో రేవ్‌ పార్టీ, డ్రగ్స్‌పై విచారణ జరుపుతున్నారు. రేవ్ పార్టీ ఎవరు జరిపించారు? డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు? దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో ఎన్సీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 2021, అక్టోబర్ 04వ తేదీ సో్మవారం సాయంత్రం వరకు విచారించి.. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Read More : Prakash Raj: ప్రతి ఒక్కడు మగాడే.. ఒళ్లు దగ్గరపెట్టుకోండి..! ప్రకాశ్‌రాజ్ ఫైర్

ఈ డ్రగ్ రాకెట్ ను చేధించింది ఎన్ సీబీ అనే విషయం తెలిసిందే. ఎన్ సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే కూడా ఉన్నారు. అసలు ఆయన ఎవరు ? అనే దానిపై ఇంటర్నెట్ లో ప్రజలు ఆరా తీయడం మొదలు పెట్టారు. 40 ఏళ్ళ సమీర్ వాంఖెడే ముంబాయిలో జన్మించారు. ఆయన తండ్రి పోలీస్ ఆఫీసర్ కావడం విశేషం. సమీర్ 2017లో మరాఠి నటి క్రాంతీ రెడ్ కర్ ను పెళ్లి చేసుకున్నారు. 2004లో ఇండియన్ రెవెన్యూ సర్వీసు (ఐఆర్ఎస్)కు ఎంపికయ్యారు. మొదట ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) డిప్యూటీ కమిషనర్ గా పనిచేశారు.

Read More : Tiger In Tirumala : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుతపులి సంచారం

ఎన్ఐఏ అదనపు ఎస్పీగా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI)లో జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వర్తించారు. పన్నుల విషయంలో ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. పన్నుల ఎగవేతపై ఉక్కుపాదం మోపారు. పన్నులు ఎగవేస్తున్న ధనవంతుల బండారాన్ని ఆయన బయటపెట్టారు. కోట్లాది రూపాయలు వసూలు చేశారు. క్రమశిక్షణ కలిగిన నిజాయితీపరుడైన అధికారిగా ఆయన పేరు ఉంది. సమీర్ కు అసలు భయం అంటే ఏమిటో తెలియదని, తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను చోటివ్వరని కొందరు అంటుంటారు.