Bombay HC :’ఇదేం పిచ్చి వాదన?వేస్టు మాటలు మాని..పాయింట్స్ మాట్లాడండీ లాయర్ గారూ : జడ్జీ చీవాట్లు

ఓ తల్లి కన్న కూతురిపై కేసు పెట్టింది. కోర్టు మెట్లు ఎక్కింది. ఆమె తరపు లాయర్ కోర్టులో వాదిస్తూ తన క్లైంట్ కూతురుకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటూ వాదించాడు. ఆమె ప్రవర్తన మంచిదికాదంటూ ఆరోపించాడు. సాక్షాత్తూ బాంబే హై కోర్టులో జరిగిన ఈ అనూహ్య ఘటనకు కోర్టు సదరు లాయర్ కు దానికి కోర్టు లాయర్ ను ముక్క చీవాట్లు పెట్టింది..!

Bombay HC :’ఇదేం పిచ్చి వాదన?వేస్టు మాటలు మాని..పాయింట్స్ మాట్లాడండీ లాయర్ గారూ : జడ్జీ చీవాట్లు

Bombay Hc (1)

Bombay hc judge objected with lawyer argument : ఓ తల్లి కన్న కూతురిపై కేసు పెట్టింది. కోర్టు మెట్లు ఎక్కింది. ఆమె తరపు లాయర్ కోర్టులో వాదిస్తూ తన క్లైంట్ కూతురుకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటూ వాదించాడు. ఆమె ప్రవర్తన మంచిదికాదంటూ ఆరోపించాడు. సాక్షాత్తూ బాంబే హై కోర్టులో జరిగిన ఈ అనూహ్య ఘటనకు కోర్టు సదరు లాయర్ కు దానికి కోర్టు లాయర్ ను ముక్క చీవాట్లు పెట్టింది..!

బాంబే హైకోర్టులో ఓ తల్లి తన కన్న కూతురిపైనే పిటిషన్ దాఖలు చేసింది. మరికొద్ది రోజుల్లో కూతరు ఆస్ట్రేలియాకు వెళ్తుందనగా ఆమెపై గృహ హింస కేసును నమోదు చేసింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరింది. తన కన్న కూతురు తనను చిత్రహింసలకు గురిచేస్తోందనీ..తనకు న్యాయం చేయాలని కోర్టును కోరింది.

కానీ కన్న కూతురే తల్లిని గృహహింసకు గురి చేసిందంటే ఎవ్వరూ నమ్మరు. అలాగే కోర్టు కూడా నమ్మలేదు. కోర్టుకు కావాల్సింది ఆరోపణలు కాదు ఆధారాలు కావాలి.అలాగే కోర్టు ఆధారాలు చూపించమని పిటీషనర్ కోరారు. దానికి ఆమె తరపు లాయర్ ఓ విచిత్ర వాదనను కోర్టు ముందుంచారు. ’ నా క్లైంట్ కుమార్తెకు చాలా మంది లవర్స్ ఉన్నారు..ఆమె ప్రవర్తన మంచిది కాదు అనటానికి ఇదే ఉదాహరణ’ అంటూ అసందర్భ వ్యాఖ్యలు చేశారు.

ఆ వ్యాఖ్యలకు న్యాయమూర్తి వెంటనే కల్పించుకున్నారు. ఆ వ్యాఖ్యలు చేసిన లాయర్ కు కోర్టులోనే చీవాట్లు పెట్టారు. అవన్నీ వేస్టు మాటలు..కేవలం ఆరోపణలు మాత్రమే..అటువంటి మాటలు వదిలేసి లా పాయింట్లు మాట్లాడండి లాయర్ గారూ అంటూ చురకలు వేస్తూ హితవు పలికారు. న్యాయమూర్తి వేసిన చీవాట్లకు సదరు లాయర్ గారి తల తిరిగిపోయింది. తలకొట్టేసినట్టయింది. ఏం మాట్లాడాలో తెలియక నోరు మూసుకుని ఉండిపోయారు. బాంబే హైకోర్టులో గురువారం (ఏప్రిల్ 8,2021) జరిగింది.

ముంబై నగరానికి చెందిన ఓ మహిళ బాంబే హైకోర్టులో ఓ పిటిషన్ ను దాఖలు చేసింది. కూతురిపై గృహహింస కేసును నమోదు చేయటంతో ఈ కేసు తరపున వాదించడానికి కెన్నీ థక్కర్ అనే న్యాయవాదిని మాట్లాడుకుంది. కోర్టులో ఆమె తరపున వాధించిన కెన్నీ ‘‘తల్లిని చిత్రహింసలు పెట్టిందనీ, అన్నం పెట్టేది కూడా కాదనీ, అసభ్య పదజాలంతో దూషించేదనీ, కొట్టేదనీ’’ ఇలా పలు ఆరోపణలతో వాదనలు వినిపించారు. అయితే వాటికి సంబంధించిన ఆధారాలను, సాక్షాలను మాత్రం చూపించలేకపోయారు.

అక్కడితో ఊరుకోకుండా..’నా పిటిషనర్ కూతురికి ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆమె ప్రవర్తన మంచిది కాదని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు‘ అంటూ వాదించారు. దానికి న్యాయమూర్తి లాయర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు ఆమె క్యారెక్టర్ గురించి కాదు..లా పాయింట్ల మీద మాట్లాడండంటూ లాయర్ గారూ..అంటూ న్యాయమూర్తి హితవు పలికారు. ’ఇదేం పిచ్చి వాదన. అది ఆమె జీవితం. ఆమె ఇష్టం. ఆమెకు ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారన్న దాని గురించి కాదు ఇక్కడ కేసు నడుస్తోంది. పిటిషనర్ వాదనకు సంబంధించిన లా పాయింట్లను మాత్రమే మాట్లాడండి‘ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించడంతో లాయర్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

ఈకేసులో పిటిషనర్ కూతురు త్వరలోనే ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. ఆమె ఉన్నత చదువుల నిమిత్తం వీసా కార్యక్రమాలన్నింటిని పూర్తి చేసుకుంది. ఈక్రమంలో ఈకేసు వాదనలు జరుగుతున్న సందర్భంలో న్యాయమూర్తి పిటీషనర్ కు కొన్ని హితవులు చెప్పారు. ‘కన్న కూతురు విదేశాల్లో చదువుకుంటే తల్లి గర్వపడాలని అన్నారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఏప్రిల్ 19 వ తేదీకి తీర్పును వాయిదా వేశారు. మరి ఈ విచిత్రమైన కేసులో జడ్జ్ మెంట్ ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది.