RAPO20: రామ్ కోసం బోయపాటి ‘యాక్షన్’ ప్లాన్ షురూ!
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లోని 20వ చిత్రాన్ని మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయాపటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

Boyapti Starts New Schedule Of RAPO20 With Action Sequence
RAPO20: యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లోని 20వ చిత్రాన్ని మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయాపటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
RAPO20: రామ్-బోయపాటి.. బాలీవుడ్ భామలు కాదు.. క్రష్మికే ఫైనల్?
ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ షూటింగ్ నేడు రామోజీ ఫిలిం సిటీలో మొదలుపెట్టినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ షెడ్యూల్ ను ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో స్టార్ట్ చేశాడట డైరెక్టర్ బోయపాటి. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను ఈ సినిమాకే హైలైట్‌గా ఉండేలా తీర్చిదిద్దుతున్నాడట బోయపాటి. దానికి కోసం స్టంట్ కొరియోగ్రాఫన్ స్టంట్ శివతో ఓ అద్భుతమైన సీక్వెన్స్‌ను ఆయన డిజైన్ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది.
BoyapatiRAPO: వరుస అప్డేట్స్తో అదరగొట్టిన రామ్ బోయపాటిలు!
ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో రామ్ చెలరేగిపోతున్నాడట. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రామ్, బోయపాటిలు భావిస్తున్నారట. కాగా, ఈ సినిమాలో రామ్ సరసన అందాల భామ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తుండగా, ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తోంది.