Union Budget 2022 : రైతులు, వ్యాపారుల కోసం రైల్వేస్ లో వన్ స్టేషన్-వన్ ప్రొడక్ట్ విధానం : మంత్రి నిర్మల

రైతులు, వ్యాపారుల కోసం రైల్వేస్ లో వన్ స్టేషన్-వన్ ప్రొడక్ట్ విధానం అమలు చేస్తున్నామని కేంద్రం బడ్జెట్ 2022లో కేంద్రం ఆర్థికమంతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Union Budget 2022 : రైతులు, వ్యాపారుల కోసం రైల్వేస్ లో వన్ స్టేషన్-వన్ ప్రొడక్ట్ విధానం : మంత్రి నిర్మల

Budget 2022 (2)

Union Budget 2022 : రైతులు, వ్యాపారుల కోసం..రైల్వేల్లో వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ లో భాగంగా వ్యాపారులకు ప్రయోజనం కలిగించేలా పథకానికి ఈ బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించామని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి నిర్మలా చిన్న, సన్నకారు రైతుల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని..ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ప్రోత్సహాలు అందిస్తున్నామన్నారు. చిన్న రైతుల కోసం రైల్వేల ద్వారా రవాణా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.

రైల్వేల్లో వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ విధానం అమలు చేస్తున్నామన్నారు. రైతుల కోసం చిరుధాన్యాల ఉత్పత్తి పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని..దీంట్లో భాంగా చిరుధాన్యాల సంవత్సరంగా 2023 సంవత్సరం ఉంటుందని భరోసా ఇచ్చారు. చిరుధాన్యాల అభివృద్ధికి అదనపు ప్రోత్సాహం. 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించామని దాని కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని అన్నారు.. వంటనూనెల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి. పీపీపీ మోడల్‌లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం. రసాయన రహిత వ్యవసాయ అభివృద్ధికి మరింత ప్రోత్సాహంసేంద్రీయ ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం.

Also read : Budget 2022 : వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు : మంత్రి నిర్మలా సీతారామన్

అలాగే..ఎంఎస్‌ఎంఈలకు మార్కెటింగ్‌ సహకారం కోసం నూతన పోర్టల్‌. ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం.పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం అదనపు నిధులు. ప్రత్యేక వ్యవస్థలు. ఉద్యోగులు, కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఆన్‌లైన్‌లో నేర్చుకునేందుకు అవకాశాలు. ప్రతి రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు మంత్రి నిర్మలా సీతారామన్. పేద మధ్యతరగతి సాధికారితకు ప్రభుత్వం పనిచేస్తోందని వారి అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు.

వచ్చే 25 ఏళ్ళ పురోగతికోసం ఈ బడ్జెట్ ప్లాన్ ఉందని తెలిపిన మంత్రి..ప్రపంచంలోనే వేగంగా పురోగతి సాధిస్తున్న దేశంగా భారత్ ఉందని అన్నారు. నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్‌ ఉందని..దీంట్లో ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, అభివృద్ధి ఆధారిత ఉపాధి, ఉద్యోగ కల్పనపరిశ్రమలకు ఆర్థిక ఊతమిచ్చేలా ఉందన్నారు.

Also read :  Budget 2022 : ఈ బడ్జెట్‌ రానున్న 25 ఏళ్ల అమృతకాలానికి పునాది : మంత్రి నిర్మలా సీతారామన్

పీఎం గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌… దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశమని.. వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. నీలాంచల్‌ నిస్పాత్​ నిగమ్‌ లిమిటెడ్‌ను ప్రైవేటుపరం చేశామని తెలిపిన మంత్రి . త్వరలో ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ రాబోతుందన్నారు.

అలాగే పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది పలుకుతుందని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థికసాయం లభిస్తుందని… గృహనిర్మాణం, వసతుల కల్పన, తాగునీరు కల్పనలో దేశం వేగంగా ముందుకెళ్తోందని తెలిపారు.

Also read : Union Budget 2022 : అన్ని రాష్ట్రాల్లో ఈ-పాస్‌పోర్టుల విధానం : మంత్రి నిర్మల

అలాగే నేషనల్ హైవేస్ నెట్ వర్క్ గురించి మంత్రి వివరిస్తు.. నేషనల్ హైవేస్ నెట్ వర్క్ ని 25 వేల కిలోమీటర్లు పెంచుతామని..దీని కోసం 20 వేల కోట్లు సమీకరిస్తున్నామని అన్నారు. ఆత్మ నిర్బర్ భారత్ లో భాగంగా ఇప్పటికే ఉద్యోగావకాశాలు పెంచామని రానున్న ఐదేళ్లలో మరో 60 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

వచ్చే 3 ఏళ్ళలో 400 న్యూజనరేషన్ వందే భారత్ రైళ్ళు. నదుల అనుసంధానానికి బడ్జెట్ లో ప్రోత్సాహం ఉందన్నారు.అలాగే ప్రధాని ఈ-విద్య కార్యక్రమం కింద టెలివిజన్‌ ఛానళ్లు 12 నుంచి 200కు పెంపు ఉందన్నారు. డ్రోన్ల సాయంతో పంట పొలాలకు పరీక్షలు. రక్షణ. డిజిటల్ హెల్త్ సిస్టమ్ కు ప్రోత్సాహం. మానసిక ఆరోగ్యం కోసం పథకం. డిజిటల్ బ్యాంకింగ్ కి ప్రోత్సాహం కల్పిస్తామన్నారు.

Also read : Union Budget 2022 : చేనేత చీరలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ

డిజిటల్‌ చెల్లింపులు, డిజిటల్‌ బ్యాంకింగ్‌కు ఈ ఏడాది కూడా మరింత ప్రోత్సాహముంటున్నాన్నారు. 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, నెట్‌బ్యాంకింగ్‌, ఏటీఎం సేవలు. పీఎం ఆవాస్ యోజన కింద 80 లక్షల ఇళ్ళ నిర్మాణం. మహిళా, శిశు సంక్షేమం కోసం మిషన్‌ శక్తి, వాత్సల్య, సక్షం అంగన్‌వాడీల రూపకల్పన. గత రెండేళ్లలో నల్‌సే జల్‌ కింద 5.7కోట్ల కుటుంబాలకు లబ్ధిచేకూరుతుందని తెలిపారు.

ఈ పాస్ పోర్ట్ పథకం. దేశ పౌరులకు సులభంగా పాస్ పోర్ట్ పొందే అవకాశం. 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ సేవా కేంద్రాలు. పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థ కు ఊతమని తెలిపిన మంత్రి వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ విధానం అమలు. ప్రజలకు అందుబాటులో రిజిస్ట్రేషన్ ఆఫీసులు.