Budget 2022 : వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు : మంత్రి నిర్మలా సీతారామన్

వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు

Budget 2022 : వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు : మంత్రి నిర్మలా సీతారామన్

Budget 2022 (1)

Budget 2022..Coming 5 years 60 lakh jobs : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా యువతకు శుభవార్త చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 60లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే 25 ఏళ్లు అమృతకాలమని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ ను తయారుచేశామని తెలిపిన మంత్రి నిర్మలమ్మ రానున్న ఐదేళ్లలో 60లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.

మనం ఇప్పుడు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ గడియల్లో ఉన్నామని..విజన్ తో ముందుకెళు ప్రజల కోసం పాటు పడతున్నామని..మరో 25 ఏళ్ల విజన్‌తో మా ప్రభుత్వం బడ్జెట్ రూపొందించిందని తెలిపారు. దీంట్లో భాగంగానే రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్‌తో బంగారు పునాది వేశామని అన్నారు. కరోనా సంక్షోభంలో కూడా సవాళ్లను ఎదుర్కొనే స్థితిలో ఉన్నామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. డిజిటల్ ఎకానమీని ప్రమోట్ చేస్తున్నామన్నారు. ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్స్‌తో 16 సెక్టార్లలో 60 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు.

Also read : Budget 2022 : ఈ బడ్జెట్‌ రానున్న 25 ఏళ్ల అమృతకాలానికి పునాది : మంత్రి నిర్మలా సీతారామన్

అలాగే రైతుల కోసం వ్యాపారుల ప్రయోజనాల కోసం పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రానున్న 25 ఏళ్లలో దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పలు అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ బడ్జెట్ రూపొందించామని తెలిపారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని.. చిరుధాన్యాల అభివృద్ధికి అదనపు ప్రోత్సాహం ఇస్తామన్నారు. 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. వంటనూనెల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిపీపీపీ మోడల్‌లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహిస్తామన్నారు.

పర్వతమాల ప్రాజెక్టు కింద పర్యావరణ హితమైన అభివృద్ధి చేస్తామని తెలిపారు. కొండ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి తగినంత అవకాశాలున్నాయని..పర్వతమాల ప్రాజెక్టులో 8 రోప్‌వేల అభివృద్ధిదేశంలో నాలుగుచోట్ల మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. మల్టీమోడల్‌ కనెక్టివిటీలో భాగంగా రైల్వేలతో ఇతర రవాణా సదుపాయాల అనుసంధానం చేస్తామని మంత్రి తెలిపారు.

Also read : Union Budget 2022 : చేనేత చీరలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ