Union Budget 2022 : అన్ని రాష్ట్రాల్లో ఈ-పాస్‌పోర్టుల విధానం : మంత్రి నిర్మల

దేశంలో అతి త్వరలోనే త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ-పాస్‌పోర్ట్‌ విధానం తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Union Budget 2022 : అన్ని రాష్ట్రాల్లో ఈ-పాస్‌పోర్టుల విధానం : మంత్రి నిర్మల

Union Budget 2022 E Passpo

Union Budget 2022 : దేశంలో అతి త్వరలోనే త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ-పాస్‌పోర్ట్‌ విధానం తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి పథకం తీసుకొస్తామన్నారు. 2022-23లో ఈ-పాస్‌పోర్టుల జారీకి కొత్త సాంకేతికత తీసుకొస్తామన్నారు. నగరాలు, పట్టణాల అభివృద్ధికి నూతన పట్టణ ప్రణాళిక అమలు చేస్తామన్నారు. నగరాల్లో ప్రయాణ సౌకర్యాల అభివృద్ధితో పాటు పట్టణాలు, నగరాల్లో నిర్మాణరంగంలో సంస్కరణలు తీసుకొస్తామని తెలిపారు. పట్టణ ప్రణాళిక అభివృద్ధికి ప్రత్యేక కోర్సులు, సిలబస్‌ కూడా తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్టు మంత్రి నిర్మల పేర్కొన్నారు.

75 జిల్లాల్లో 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అలాగే దేశంలో నాలుగు చోట్ల మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణకు డీజిల్‌, పెట్రోల్‌ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించనున్నట్టు తెలిపారు. విద్యుత్‌ వాహనాల పెంపులో భాగంగా బ్యాటరీల అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. 2022-23లో 5G సర్వీసులు తీసుకొస్తామన్నారు. భూ సంస్కరణల్లో భాగంగా ఒక దేశం.. ఒక రిజిస్ట్రేషన్‌ విధానాన్ని ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు.

మినిమం, మ్యాక్సిమం గవర్నమెంట్‌ లక్ష్యంలో భాగంగా కాలం తీరిన అనేక చట్టాలను రద్దుచేసినట్టు బడ్జెట్ ప్రసంగంలో నిర్మల వెల్లడించారు. పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణకు డీజిల్‌, పెట్రోల్‌ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు
తీసుకురానున్నట్టు తెలిపారు.

విద్యుత్‌ వాహనాల పెంపులో బ్యాటరీల అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలు అందించనున్నట్టు నిర్మలమ్మ చెప్పారు. దేశవ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేషన్‌ పథకం(NGDRS‌) దేశంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్‌కు నూతన వ్యవస్థ తీసుకొచ్చే దిశగా కేంద్రం కృష్టి చేస్తొందని, దేశవ్యాప్తంగా డీడ్‌లు, రిజిస్ట్రేషన్లకు ఆధునిక వ్యవస్థ తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉందని మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.

Read Also : Budget 2022 : వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు : మంత్రి నిర్మలా సీతారామన్