Bull travelling on train: ప్యాసింజర్ ట్రైన్‭లో ప్రయాణించిన దున్నపోతు

ఈ వీడియోపై నెటిజెన్లు సదరాగా కామంట్లుకు చేస్తున్నారు. మనిషి సోషల్ యానిమల్ అని ఒక తత్వవేత్త చెప్పాడని, కావును మనుషులతో యానిమల్ ప్రయాణించడంలో తప్పేంటని ఒక నెటిజెన్ కొంటెగా స్పందించారు. మరొక వ్యక్తి స్పందిస్తూ ‘‘ఇదే నిజమైన సమానత్వం’’ అని రాసుకొచ్చారు. మరొక వ్యక్తి ఆ దున్నపోతును అన్వయిస్తూ ‘‘నువ్వు నన్ను బయటికి పొమ్మంటే నేను పోలీసులుకు ఫిర్యాదు చేస్తాను’’ అని చెప్పుకొచ్చాడు.

Bull travelling on train: ప్యాసింజర్ ట్రైన్‭లో ప్రయాణించిన దున్నపోతు

Bull travelling on passenger train in Bihar

Bull travelling on train: జంతువులను వాహనాల్లో తరలించడం మామూలే. సందర్భాల్ని బట్టి రైళ్లలో, విమానాల్లో కూడా తరలిస్తారు. కానీ మనుషులు ప్రయాణించే ప్యాసింజర్ వాహనాల్లో తరలించారు. అయితే ప్యాసింజర్లలో కూడా అరుదుగా జంతువులు ప్రయాణిస్తుంటాయి. పెంపుడు కుక్క, పిల్లి లాంటివి మనుషుల మధ్య అప్పుడప్పుడు ప్రయాణిస్తుంటాయి. తాజాగా బిహార్‭లో ఒక దున్నపోతు ప్యాసింజర్ ట్రైన్‭లో ప్రయాణించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పది నుంచి పన్నెండు మంది ఉన్న ఒక బోగీలో వారి మధ్య దున్నపోతు నిల్చుని ఉంది. ఒక వ్యక్తి దున్నపోతుకు కాపలాగా నిల్చున్నాడు. ఆ దున్నపోతును తీసుకువచ్చిన వచ్చిన వ్యక్తి అతడే. ఈ దున్నపోతును జార్ఖండ్‭లోని సహిబ్‭గంజ్ నుంచి బిహార్‭కు తరలించారట.

కాగా, ఈ వీడియోపై నెటిజెన్లు సదరాగా కామంట్లుకు చేస్తున్నారు. మనిషి సోషల్ యానిమల్ అని ఒక తత్వవేత్త చెప్పాడని, కావును మనుషులతో యానిమల్ ప్రయాణించడంలో తప్పేంటని ఒక నెటిజెన్ కొంటెగా స్పందించారు. మరొక వ్యక్తి స్పందిస్తూ ‘‘ఇదే నిజమైన సమానత్వం’’ అని రాసుకొచ్చారు. మరొక వ్యక్తి ఆ దున్నపోతును అన్వయిస్తూ ‘‘నువ్వు నన్ను బయటికి పొమ్మంటే నేను పోలీసులుకు ఫిర్యాదు చేస్తాను’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘చాలా కామ్‭గా నిల్చుంది. చూస్తుంటూ ట్రైన్‭లో ప్రయాణించడం బాగా అలవాటైన దున్నపోతులా ఉంది’’ అని మరొకరు స్పందించారు.

Tiniest Bike: అతిచిన్న సైకిల్ నడిపిన వృద్ధుడు.. ఆకట్టుకుంటున్న క్రేజీ వీడియో