TS RTC : బస్సు భవన్ కు వాస్తు తిప్పలు.. ప్రధాన ద్వారం మూసేసిన అధికారులు

తెలంగాణ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు అధికారులు. ఈ నేపథ్యంలోనే అధికారులు ప్రధాన ద్వారం మూసివేసి.. తూర్పు ద్వారం నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు.

TS RTC : బస్సు భవన్ కు వాస్తు తిప్పలు.. ప్రధాన ద్వారం మూసేసిన అధికారులు

Ts Rtc

TS RTC : తెలంగాణ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు అధికారులు. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ప్రయాణం సాగిస్తున్న టీఎస్ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఓ వైపు కసరత్తు చేస్తోండగా మరోవైపు ఇటీవల ఏండీగా బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఓ వైపు సంస్థలో లోటుపాట్లను సిబ్బంది సమస్యలు బస్సు స్టేషన్ల పరిస్థితి మౌలిక సదుపాయాలపై వివరాలు సేకరిస్తున్నారు. పనిలో పనిగా సంస్థకు గుండెకాయ అయిన ఆర్టీసీ ప్రధాన కార్యాలయంపైన దృష్టి పెట్టారు. బస్సు భవన్ లోని వాస్తును సైతం సిట్ రైట్ చేసి రైట్ రైట్ అనాలని భావిస్తున్నారు.

Read More : TSRTC: నాలుగు నెలలే టార్గెట్.. గాడిన పడకపోతే ప్రైవేట్ పరమే!

బస్సు భవన్ లో సిబ్బంది అంత ఎప్పటినుంచో ముందు గేట్ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రధాన ద్వారం గుండానే రాకపోకలు జరిగేవి. ఇటీవల సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భవన్ కి వచ్చే ప్రధాన ద్వారాన్ని మూసేశారు. లోపలికి రావడానికి బయటకు వెళ్ళడానికి అవుట్ గేట్ ఉపయోగిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

ఇక ఇదే అంశంపై వాస్తు నిపుణులు రాఘవేంద్ర శర్మ 10టీవీతో మాట్లాడారు.. వాస్తుని విశ్వసించే ఇంటి నిర్మాణం చేస్తారని, అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ సమయంలో కూడా వాస్తు చూస్తారని.. చిన్న చిన్న వాస్తు దోషాల వలన దీర్ఘ కాల నష్టాలు వస్తుంటాయని తెలిపారు. ఆర్టీసీ భవన్ విషయంలో కూడా అదే జరిగిందని ఆయన తెలిపారు. ఆర్టీసీ భవన్ కి దక్షిణ ఆగ్నేయంలో ఉన్న గేటును మూసివేయించి, తూర్పు ఈశాన్యంలో ఉన్న గేటును ఉపయోగిస్తున్నారు. దీని వలన సంస్థ నష్టాలనుంచి బయటపడే అవకాశం ఉందని తెలిపారు.

Read More : Delhi : ‘ఐ లవ్ యూ’ అని భర్తకు మెసేజ్ చేసి..బిల్డింగ్ పైనుంచి దూకేసింది

బస్సు భవన్ నిర్మాణం చేసి 15 ఏళ్లకు పైగా అయిందని అప్పటినుంచి ఇప్పటివరకు ఆర్టీసీ లాభాలు ఆర్జించిన దాఖలాలు లేవని ప్రధాన ద్వారం కూడా ఒక కారణమని తెలిపారు. దక్షిణ ఆగ్నేయం గేటు నిర్మాణం లోపలికి జరగడం వలన దక్షిణ నైరుతి పెరగడం జరిగిందని దీని వలన ఆర్ధిక పరమైన నష్టాలను ఎక్కువగా చవిచూడటం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం తూర్పు ఈశాన్యం నుంచి రాకపోకలు జరపడం సంస్థకు శుభపరిణామం అని చెప్పొచ్చని వివరించారు రాఘవేంద్ర శర్మ.