కరోనా వ్యాక్సిన్ కోసం 70 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు.

carona vaccine, Over 70 lakhs healthcare workers register on Co-WIN platform : భారత దేశంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఇంతవరకు 70 లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వ్యాక్సిన్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపోందించిన యాప్ Co-WINలో మొత్తం 70,33,338 మంది తమ వివరాలను నమోదు చేశారు.
టీకా వేసిన తర్వాత వారికి వచ్చే రియాక్షన్స్ ను ట్రాక్ చేయడానికి ఈ యాప్ ఉపయోగ పడుతుంది. వ్యాక్సినేషన్ తొలి దశలో భాగంగా వీళ్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మొత్తం కోటి మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం ప్రభుత్వం 2.3 లక్షల మంది వ్యాక్సినేటర్లను గుర్తించింది. అంతేకాకుండా 51 వేల ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగనుంది.
జనవరి 2,శనివారం నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాక్సిన్ డ్రైరన్ జరగనుంది. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉన్న సవాళ్లను గుర్తించడంతోపాటు Co-WIN యాప్ అమలు ఎలా ఉందో పరిశీలించనున్నారు.
టీకాల అనుమతుల అంశంపై కేంద్ర షధ ప్రమాణాల నియంత్రణ సంస్ధ నిపుణుల కమిటీ శుక్రవారం ఢిల్లీలో బేటీ అయ్యింది. నేటి బేటిలో టీకాకు అనుమతులు లభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది, టీకా అత్యవసర వినియోగానికి సీరం, భారత్ బయోటెక్, పైజర్ సంస్ధలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తులపై నిపుణుల కమిటీ ఇప్పటికే రెండు సార్లు భేటీ అయ్యింది.