Liquor Scam: మనీశ్ సిసోడియాకు మళ్లీ సమన్లు జారీ చేసిన సీబీఐ

120బి (నేరపూరిత కుట్ర), 477ఎ (రికార్డుల తారుమారు), సెక్షన్ 7తో సహా భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ గతేడాది ఆగస్టులో ప్రత్యేక కోర్టులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం, అవినీతి లేదా చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా లేదా వ్యక్తిగత ప్రభావంతో ప్రభుత్వ ఉద్యోగిని ప్రభావితం చేయడానికి అనవసర ప్రయోజనాలను పొందడం వంటి వాటి మీద కేసులు వేశారు

Liquor Scam: మనీశ్ సిసోడియాకు మళ్లీ సమన్లు జారీ చేసిన సీబీఐ

CBI summons Manish Sisodia again in Delhi liquor scam

Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గతంలో పలుమార్లు విచారణ ఎదుర్కొన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ మరోసారి సమర్లు జారీ చేరీ చేసింది. ఈ విషయాన్ని మనీశ్ సిసోడియా స్వయంగా వెల్లడించారు. తనను సీబీఐ ఆదివారం తమ ప్రధాన కార్యాలయానికి పిలిపించిందని తన ట్విట్టర్ ఖాతాలో శనివారం వెల్లడించారు. సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం.. మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా లభించిన తాజా సాక్ష్యాధారాల ఆధారంగా రేపు విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో జరిగిన అవినీతికి జరిగిందంటూ లిక్కర్ స్కాం పైకి లేచిన విషయం తెలిసిందే.

Jitan Ram Manjhi: బిహార్ మహా కూటమిలో పేలిన బాంబ్.. కొడుకును సీఎం చేయాలంటూ మాజీ సీఎం డిమాండ్

‘‘రేపు తమ కార్యాలయానికి రావాలంటూ సీబీఐ నన్ను మళ్లీ పిలిచింది. ఈడీ, సీబీఐల పూర్తి అధికారాన్ని నాపైనే ప్రయోగిస్తున్నారు. అధికారులు నా ఇంటిపై దాడులు చేశారు. నా బ్యాంకు లాకర్‌లో సోదాలు చేశారు. అయినా నాకు వ్యతిరేకంగా వారికి ఒక్క ఆధారం లభించలేదు. పిల్లలను బాగా చదివించేందుకు ఏర్పాట్లు చేశాను. అందుకే ఢిల్లీవారు (కేంద్ర ప్రభుత్వం) నన్ను ఆపాలని ప్రయత్నిస్తున్నారు. విచారణకు నేను ఎప్పుడూ సహకరిస్తాను’’ అని సిసోడియా ట్వీట్‌ చేశారు.

Drugs-Weapons : పంజాబ్ గురుదాస్ పూర్ సెక్టార్ లో డ్రగ్స్, ఆయుధాలు కలకలం

120బి (నేరపూరిత కుట్ర), 477ఎ (రికార్డుల తారుమారు), సెక్షన్ 7తో సహా భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ గతేడాది ఆగస్టులో ప్రత్యేక కోర్టులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం, అవినీతి లేదా చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా లేదా వ్యక్తిగత ప్రభావంతో ప్రభుత్వ ఉద్యోగిని ప్రభావితం చేయడానికి అనవసర ప్రయోజనాలను పొందడం వంటి వాటి మీద కేసులు వేశారు. మద్యం వ్యాపారులకు లైసెన్సులు మంజూరు చేయాలనే ఢిల్లీ ప్రభుత్వ విధానం.. అందుకు లంచాలు చెల్లించినట్లు కొంతమంది డీలర్ల ఆరోపణలకు అనుకూలంగా ఉందని సీబీఐ ఆరోపించింది. అయితే సీబీఐ చేస్తున్న ఆరోపణల్ని ఆప్ తీవ్రంగా ఖండించింది.