50 Lakh Fine: మాస్కుల్లేని ప్రయాణికుల నుంచి రూ.50లక్షలు వసూలు చేసిన రైల్వేశాఖ

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైళ్లు, ప్లాట్‌ఫారమ్‌లపై మాస్క్‌లు ధరించని ప్రయాణీకులకు సెంట్రల్ రైల్వే భారీగా జరిమానాలను విధిస్తోంది.

50 Lakh Fine: మాస్కుల్లేని ప్రయాణికుల నుంచి రూ.50లక్షలు వసూలు చేసిన రైల్వేశాఖ

Railway Fee

50 Lakh Fine: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైళ్లు, ప్లాట్‌ఫారమ్‌లపై మాస్క్‌లు ధరించని ప్రయాణీకులకు సెంట్రల్ రైల్వే భారీగా జరిమానాలను విధిస్తోంది. జనవరి 12వ తేదీన సెంట్రల్ రైల్వే స్టేషన్లలో మాస్క్‌లు ధరించని 256 మందికి జరిమానా విధించింది రైల్వేశాఖ. వారి నుంచి 44వేల 900రూపాయలను జరిమానాగా వసూలు చేశారు. జనవరి 2022లో ఇప్పటివరకు మొత్తం 2293 మంది వ్యక్తులు మాస్క్‌లు వేసుకోని కారణంగా వారి నుంచి రూ.3.93లక్షల జరిమానా వసూలు చేశారు.

కోవిడ్ అనలాగ్ బిహేవియర్ (CAB) ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మాస్క్‌లు ధరించని ప్రయాణికుల నుంచి జరిమానా వసూలు చేసే విధానాన్ని సెంట్రల్ రైల్వే ఏప్రిల్ 2021 నుంచి ప్రారంభించింది. కోవిడ్-19 మార్గదర్శకాల ప్రకారం మాస్క్‌లు/ఫేస్ కవర్లు ధరించనందుకు ఇప్పటివరకు సెంట్రల్ రైల్వేలోని టికెట్ చెకింగ్ సిబ్బంది ప్రత్యేక బృందాలు.. మొత్తం 30,375 మంది ప్రయాణికులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ .50.20లక్షల జరిమానా వసూలు చేశారు.

డివిజన్ల వారీగా వసూళ్ల గణాంకాలు:
ముంబై డివిజన్ – 3వేల 143 మంది నుంచి రూ.6.18 లక్షల జరిమానా వసూలైంది.
భూసావల్ డివిజన్ – 14,046 మంది నుంచి రూ .16.41 లక్షల జరిమానా వసూలు చేశారు
నాగ్‌పూర్ డివిజన్ – 7,924 మందికి రూ .15.84 లక్షల జరిమానా విధించారు.
షోలాపూర్ డివిజన్ – 2,404 మంది నుంచి రూ .5.20 లక్షల జరిమానా వసూలు చేశారు
పూణే డివిజన్ – 2,858 మంది నుంచి రూ .6.57 లక్షల జరిమానా వసూలు చేశారు.