Amit Shah : అమిత్ షా తెలంగాణ పర్యటనలో మార్పులు, RRR టీమ్‌తో భేటీ రద్దు

Amit Shah : కొన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న అమిత్ షా.. శంషాబాద్ నుంచి నేరుగా చేవెళ్ల బహిరంగ సభకు వెళ్తారు.

Amit Shah : అమిత్ షా తెలంగాణ పర్యటనలో మార్పులు, RRR టీమ్‌తో భేటీ రద్దు

Amit Shah(Photo : Google)

Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్పల్ప మార్పులు జరిగాయి. ఆర్ఆర్ఆర్ టీమ్ తో అమిత్ షా భేటీ రద్దైంది. అంతేకాకుండా బీజేపీ నేతలతో జరగాల్సిన సమావేశం కూడా రద్దైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కార్యక్రమాలు ఉండటంతో హైదరాబాద్ కు అమిత్ షా రావటం లేటయ్యే అవకాశముంది.

Also Read..Revanth Reddy: భాగ్యలక్ష్మి అమ్మవారిపై రేవంత్ రెడ్డి ప్రమాణం.. ఈటలపై భావోద్వేగభరిత వ్యాఖ్యలు

దీంతో కొన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న అమిత్ షా.. శంషాబాద్ నుంచి నేరుగా చేవెళ్ల బహిరంగ సభకు వెళ్తారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల సభ ముగియగానే అమిత్ షా తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం అమిత్ షా హైదరాబాద్ కి 3.30 గంటలకు రావాల్సి ఉంది. అయితే, సాయంత్రం 5గంటలకు రానున్నారు. గంటనర్న లేటుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ముందు అనుకున్న సమావేశాలు రద్దయ్యాయి.

ఢిల్లీలో అమిత్ షా కు అత్యవసర మీటింగ్స్ ఉన్నాయి. ఈ కారణంగా ఆయన దాదాపు గంటన్నర ఆలస్యంగా హైదరాబాద్ కి రానున్నారు. దాంతో ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాలన్నీ రద్దు చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రం టీమ్ తో ప్రత్యేకంగా అమిత్ షా భేటీ కావాల్సింది. ఆ తర్వాత బీజేపీ ముఖ్య నేతలతోనూ సమావేశం కావాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ టీమ్ తో భేటీ అయ్యి ఆస్కార్ సాధించినందుకు వారికి సన్మానం చేయాల్సి ఉంది. అయితే హైదరాబాద్ కు రావడం గంటన్నర ఆలస్యం కానుంది. దాంతో మొత్తం కార్యక్రమాలను అమిత్ షా రద్దు చేసుకున్నారు.

Also Read..Etela Rajender: గుళ్లకు వెళ్లి.. అమ్మ తోడు, అయ్య తోడు అనడం ఏంటీ?: స్పందించిన ఈటల

ఆదివారం సాయంత్రం 5 గంటలకు అమిత్ షా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా చేవెళ్ల బహిరంగ సభకు వెళ్తారు. అక్కడ 6 గంటల నుంచి 7 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. కర్నాటక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అమిత్ షా ఆ వెంటనే ఢిల్లీకి పయనం అవుతారు. మరోసారి హైదరాబాద్ టూర్ కి వచ్చాక ట్రిపుల్ ఆర్ టీమ్ తో పాటు బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నట్లు సమాచారం.