Kiwi Fruit : కివి పండుతో బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ లకు చెక్

కివి పండ్లలో రక్తం గడ్డకట్టకుండా నివారించే యాంటిథ్రోంబోటిక్ సమృద్ధిగా ఉంది దాని వల్ల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలకు భవిష్యత్తులో దూరంగా ఉండవచ్చు

Kiwi Fruit : కివి పండుతో బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ లకు చెక్

Kiwi Fruit

Kiwi Fruit : సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి మన రోగ నిరోధక వ్యవస్థను పెంచుకునేందుకు పండ్లు తినటం చాలా మంచిది. సీజన్లో దొరికే తాజా పండ్లతో పాటు అధిక పోషకాల గనిగా చెప్పబడే కివి పండ్లును ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే వ్యాదులను దరిచేరకుండా చూసుకోవచ్చు. ఇటీవలికాలంలో బాగా ప్రాచుర్యం పొందిన చైనీస్ గూస్బెర్రీ అని పిలువబడే కివి పండ్లలో అధిక మొత్తంలో విటమిన్‌ సి, కే, కాల్షియం పొటాషియం, ఫోలేట్, ఫైబర్, సోడియం, రాగి, యాంటీఆక్సిడెంట్లు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరంలో మలినాలను తొలగించి బరువు తగ్గడానికి,చర్మ సౌందర్యాన్ని మెరుగు పరచడానికి దోహదపడుతుంది .

గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన పండ్లలో కివి కూడా ఒకటి. పోలేట్ సమృద్ధిగా ఉండటం వలన పుట్టబోయే బిడ్డలో నాడీ లోపాలు లేకుండా చేస్తుంది. శిశువు యొక్క ముఖ్యమైన అవయవాల అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. పుట్టుకతో వచ్చే వైకల్యాలు లేకుండా చేస్తుంది. దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన మలబద్దకం సమస్య లేకుండా చేయడమే కాకుండా జీర్ణక్రియ బాగా .సాగేలా చేస్తుంది.

కివి పండ్లలో రక్తం గడ్డకట్టకుండా నివారించే యాంటిథ్రోంబోటిక్ సమృద్ధిగా ఉంది దాని వల్ల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలకు భవిష్యత్తులో దూరంగా ఉండవచ్చు. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచడానికి సహాయపడి ప్రమాదకర అనీమియా సమస్యను ఎదుర్కొనవచ్చు. కివి పండ్లలో ఉన్న ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంతో పాటు రక్తంలోని ఇన్సులిన్ను నియంత్రించి టైప్ 1 టైప్ 2 డయాబెటిస్ చెక్ పెట్టొచ్చు. అయితే సాధ్యమైనంతవరకు కివి పండ్లను జ్యూస్ రూపంలో కాకుండా పండ్ల రూపంలోనే తీసుకుంటే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల ఫ్రీరాడికల్స్ యొక్క హానికరమైన ప్రభావాలు నుండి రక్షిస్తుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. గర్భధారణ సమయంలో మలబద్ధకం సాధారణంగా ఉంటుంది. ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య లేకుండా ఉంటుంది. కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు కండరాలు పళ్ళు గుండె గుండె యొక్క అభివృద్ధికి సహాయపడుతుంది. అదే సమయంలో డిప్రెషన్ ఒత్తిడి అలసట అనేవి ఉండవు. రోజుకి ఒక కివి పండు తింటే సరిపోతుంది.