Chennai Rains : వణుకుతున్న తమిళనాడు.. తుఫాన్ కుమ్మేస్తోంది

వరద ముంపులో చిక్కుకున్న తమిళనాడుకు తుపాను ముప్పు పొంచి ఉండడంతో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Chennai Rains : వణుకుతున్న తమిళనాడు.. తుఫాన్ కుమ్మేస్తోంది

Cyclone Tauktae

Chennai Rains Live Updates : వరద ముంపులో చిక్కుకున్న తమిళనాడుకు తుపాను ముప్పు పొంచి ఉండడంతో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ రెండు రోజుల్లో చెన్నై వ్యాప్తంగా 25 సెంటిమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయిదు రోజులుగా చెన్నై వరదనీటిలో నానుతోంది. లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. వరద నీరు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అంధకారంలో మగ్గుతున్నారు చెన్నైవాసులు. సగం వరకు మునిగిన ఇళ్లల్లో కాలం గడుపుతున్నారు.

Read More : India Corona cases: బీ కేర్‌ఫుల్.. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా ప్రతిరోజూ వరదముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇంతలోనే తుపాను రూపంలో మరోసారి చెన్నైపై ప్రకృతి దాడి చేయనుందన్న హెచ్చరికలతో తమిళనాట భయందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2015 తరహా దృశ్యాలు మళ్లీ పునరవృతం అవుతాయి ఏమోనని ప్రజలు బిక్కుబిక్కుమంలు కాలం వెళ్లదీస్తున్నారు. 2021, నవంబర్ 11వ తేదీ గురువారం నుంచి 48 గంటల పాటు తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీర ప్రాంత జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. మత్స్యకారులెవరూ చేపలవేటకు వెళ్లొద్దని సూచించారు.

Read More : UP Polls : లక్నోలో ప్రియాంక పాదయాత్ర

ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారు తక్షణమే వెనక్కి తిరిగి రావాలని పేర్కొన్నారు. తీర ప్రాంత జిల్లాలతో పాటు అతి భారీ వర్షాలను ఎదుర్కొనే జిల్లాలకు వాతావరణ కేంద్రం అధికారులు రెడ్ అలర్ట్‌ను జారీ చేశారు. కడలూరు, విల్లుపురం, శివగంగ, రామనాథపురం, కరైకల్, కోయంబత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో అధికారులు పలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు. మత్స్యకార గ్రామాలను ఖాళీ చేయించారు. వేలాదిమందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. వారికోసం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవును ప్రకటించారు.