UP Polls : లక్నోలో ప్రియాంక పాదయాత్ర | Priyanka Gandhi to launch ‘padayatra’ in Lucknow today

UP Polls : లక్నోలో ప్రియాంక పాదయాత్ర

ప్రగతి యాత్రను 2021, నవంబర్ 11వ తేదీ గురువారం ప్రియాంక గాంధీ ప్రారంభించి..యాత్రలో పాల్గొననున్నారు.

UP Polls : లక్నోలో ప్రియాంక పాదయాత్ర

Priyanka Gandhi Padayatra : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు బహిరంగసభలు, ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ…ప్రజలకు పలు హామీలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగా..ప్రగతి యాత్రను 2021, నవంబర్ 11వ తేదీ గురువారం ప్రియాంక గాంధీ ప్రారంభించి..యాత్రలో పాల్గొననున్నారు. బడీ కాళీజీ ఆలయం వద్ద ప్రారంభమై దర్గా హజ్రత్ అబ్బాస్ వద్ద ముగియనుంది. పాదయాత్రలో పార్టీ ఎన్నికల హామీల గురించి ప్రజలకు వివరంగా చెప్పే అవకాశం ఉంది. కులం, మతాలకు అతీతంగా..పాదయాత్ర ఉంటుందని ప్రజలకు చెప్పనున్నారు.

Read More : Pushpa The Rise : డిసెంబర్‌లో ఛలో దుబాయ్.. తగ్గేదే లే..

వచ్చే ఏడాది యూపీలో ఎన్నికలు జరుగనున్నాయ. ఇక్కడ పాగా వేసేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ తరపున ప్రియాంక చురుగ్గా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. లఖింపూర్ ఖేరీలో జరిగిన హింస, రైతులు, కార్మికులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రియాంక నిలదీశారు. పలు నిరసన కార్యక్రమాలకు ప్రియాంక నాయకత్వం వహిస్తున్నారు. షాజహాన్ పూర్ లో ఆశా వర్కర్లపై దాడి ఘటనను ఆమె ఖండిస్తూ..యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళితులు, మైనార్టీలు, చేనేత కార్మికులు, ఓబీసీలు, పేదలు, బ్రాహ్మణులు దోపిడికి గురయ్యారని, ప్రభుత్వం రోజురోజు ప్రజలపై దాడులకు పాల్పడుతోందని విమర్శించారు.

Read More : Gold Rate : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా

దేశంలో రైతుల కష్టాలను వినడానికి సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. అక్టోబర్ 10వ తేదీన..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసి నుంచి ప్రియాంక ర్యాలీని ప్రారంభించారు. 2017 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 403 స్థానాలకు బీజేపీ 312 సీట్లు సాధించింది. సమాజ్ వాదీ పార్టీ 47, బీఎస్పీ 19 సీట్లు గెలుచుకోగా..కాంగ్రెస్ 7 సీట్లు గెలచుకుంది. ఈసారి జరిగే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని సమాజ్ వాదీ, బీస్పీ ప్రకటించాయి.

×