India Corona cases: బీ కేర్‌ఫుల్.. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కొత్తగా కరోనా సోకిన రోగుల సంఖ్య పెరుగుతూ.. తగ్గుతూ ఉంటుంది. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 13లక్షల 91 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

India Corona cases: బీ కేర్‌ఫుల్.. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

India Corona

Updated On : November 11, 2021 / 11:55 AM IST

India Corona cases: దేశంలో కొత్తగా కరోనా సోకిన రోగుల సంఖ్య పెరుగుతూ.. తగ్గుతూ ఉంటుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,091 కొత్త కరోనా కేసులు నమోదవగా.. ఇదే సమయంలో కొత్తగా 340 మంది మరణించారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు కరోనా కేసులు పెరిగాయి.

ఇదే సమయంలో 13వేల 878మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. లేటెస్ట్‌గా నమోదైన కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా కేసుల సంఖ్య 3కోట్ల 44లక్షల వెయ్యి 670కి చేరుకుంది. కరోనా కారణంగా 4లక్షల 62వేల 189 మంది చనిపోయారు. ప్రస్తుతం ఇండియాలో లక్షా 38వేల 556 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

UP Polls : లక్నోలో ప్రియాంక పాదయాత్ర

ఇటీవలికాలంలో దేశవ్యాప్తంగా కేసులు తగ్గినప్పటికీ, వరుసగా రెండు రోజులు నుంచి కొంచెం కేసులు పెరుగుతున్నాయి. అయితే, యాక్టివ్ కేసులు మాత్రం 1,300 తగ్గాయి. కేరళలో మాత్రం కేసుల సంఖ్మ తగ్గట్లేదు. దేశంలో ఒక్క కేరళలోనే 7వేల 540 కేసులు కొత్తగా నమోదయ్యాయి.

మిజోరాం (11.10 %), కేరళ (10.22 %), లద్దాఖ్‌లో (5.13)లో పాజిటివిటీ రేటు ఎక్కువగా కనిపిస్తుంది. భారత్‌లో 61.99కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి. గడిచిన 24 గంటల్లో 11,89,470 టెస్టులు నిర్వహించగా.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 61కోట్ల 99లక్షల 2వేల 64 టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 3025 లాబ్స్‌లో కరోనా టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు.

T20 World Cup : పాక్ జట్టే ఫెవరేట్…ఫైనల్ చేరేది అదే – రాబిన్ ఊతప్ప