The Kashmir Files: సినిమాలో ఒకవైపే చూపించారంటోన్న చత్తీస్‌గడ్ సీఎం

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించిన ద కశ్మీర్ ఫైల్స్ రీసెంట్‌గా లైమ్ లైట్ దక్కించుకుంది. ఊహించిన దాని కంటే ఎక్కువ ఆదరణ దక్కించుకుంటున్న ఈ సినిమాపై పలువురు ప్రముఖులు కీలక కామెంట్లు..

The Kashmir Files: సినిమాలో ఒకవైపే చూపించారంటోన్న చత్తీస్‌గడ్ సీఎం

Kasmir Files

The Kashmir Files: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించిన ద కశ్మీర్ ఫైల్స్ రీసెంట్‌గా లైమ్ లైట్ దక్కించుకుంది. ఊహించిన దాని కంటే ఎక్కువ ఆదరణ దక్కించుకుంటున్న ఈ సినిమాపై పలువురు ప్రముఖులు కీలక కామెంట్లు చేస్తున్నారు. 32ఏళ్ల క్రితం కశ్మీర్ పండిట్స్ విషయంలో జరిగిన సెన్సిటివ్ ఇష్యూపై తీసిన సినిమా మార్చి 11న రిలీజ్ అయింది.

ఈ సినిమాను చూసిన చత్తీస్‌గఢ్ సీఎం మాట్లాడుతూ.. ”కశ్మీర్‌లో జరిగిన టెర్రరిస్టు ఘటనలపై తీసిన సినిమా ఇది. సినిమా మొత్తం ఫోకస్ అంతా ఒకటే కుటుంబం కనిపిస్తుంది. కాకపోతే క్లైమాక్స్‌లో మెయిన్ హీరో కేవలం హిందువులకే కాదు ముస్లింలు, సిక్కులను కూడా హత్య చేయించారని అని చెప్తాడు. కానీ, సినిమా అంతా కశ్మీరీ పండిట్స్ మాత్రమే నిర్వాసితులయ్యారనే ఒకే ఒక రాజకీయ సందేశాన్ని పంపేందుకు ఈ సినిమా రూపొందించబడింది’ అంటూ కామెంట్ చేశారు చత్తీస్‌ఘడ్ సీఎం.

‘సినిమాలో సగం మాత్రమే చూపించారు. వన్ సైడ్‌ చిత్రీకరించి రాజకీయాలు చేసి 2024లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు చేస్తూ దేశాన్ని తప్పుదిశలో తీసుకెళ్తున్నారు’ అని సీఎం వ్యాఖ్యానించారు.

Read ALso: కశ్మీర్ ఫైల్స్ మాత్రమే కాదు లఖీంపూర్ ఫైల్స్ కూడా తీయండి – అఖిలేశ్ యాదవ్

ఇప్పటికే ద కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్, గోవా, త్రిపుర, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ట్యాక్స్ ఫ్రీ చేశారు.

వివేక్ అగ్నిహోత్రి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, ప్రకాశ్ బెలవాదీలు కీలక పాత్రలు పోషించారు. సినిమా కలెక్షన్లు ఇప్పటికే రూ. వంద కోట్ల మార్కును చేరుకున్నాయి.