China: శాయ‌శ‌క్తులా పోరాడ‌తాం: అమెరికాకు చైనా వార్నింగ్‌

ద‌క్షిణ చైనా స‌ముద్రంతో పాటు తైవాన్‌, భార‌త్‌తో డ్రాగ‌న్ దేశం వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరుపై ఇటీవ‌ల‌ అమెరికా ఆందోళ‌న వ్య‌క్తం చేసిన విష‌యంపై చైనా స్పందించింది. అమెరికా తీరు స‌రికాద‌ని చెప్పుకొచ్చింది.

China:  శాయ‌శ‌క్తులా పోరాడ‌తాం: అమెరికాకు చైనా వార్నింగ్‌

China Minister

China: ద‌క్షిణ చైనా స‌ముద్రంతో పాటు తైవాన్‌, భార‌త్‌తో డ్రాగ‌న్ దేశం వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరుపై ఇటీవ‌ల‌ అమెరికా ఆందోళ‌న వ్య‌క్తం చేసిన విష‌యంపై చైనా స్పందించింది. అమెరికా తీరు స‌రికాద‌ని చెప్పుకొచ్చింది. ద‌క్షిణ చైనా స‌ముద్రంలో చైనా అక్ర‌మ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని, భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల వ‌ద్ద ప‌రిస్థితుల‌ను మ‌రింత క్లిష్ట‌త‌రం చేసేలా డ్రాగ‌న్ దేశ తీరు ఉంద‌ని తాజాగా అమెరికా ర‌క్షణ శాఖ కార్య‌ద‌ర్శి లాయిడ్ జేమ్స్ ఆస్టిన్ అన్న విష‌యం తెలిసిందే. త‌మ మిత్ర‌దేశాల‌కు క‌చ్చితం సాయం చేస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

prophet row: యూపీలో 304 మంది నిందితుల‌ అరెస్టు 

దీనిపై చైనా ర‌క్ష‌ణ శాఖ మంత్రి వీ ఫెంఘే స్పందిస్తూ.. త‌మ దేశ ప్రాంతీయ స‌మ‌గ్ర‌త‌ను కాపాడుకోవ‌డం కోసం ప‌నిచేసే త‌మ‌ ఆర్మీ సామ‌ర్థ్యాన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్ద‌ని చెప్పారు. చైనా శాయ‌శ‌క్తులా పోరాడుతుంద‌ని అన్నారు. ఏ దేశ‌మైనా తైవాన్‌ను చైనా నుంచి విడ‌దీసే ప్ర‌య‌త్నాలు చేస్తే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని చెప్పారు. అన్ని విధాలుగానూ తాము పోరాడ‌తామ‌ని హెచ్చ‌రించారు. చైనాపై అస‌త్య ప్ర‌చారం చేయ‌డాన్ని మానుకోవాల‌ని ఆయ‌న అన్నారు.

Wickremesinghe: మా దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం 2024 వ‌ర‌కు కొన‌సాగొచ్చు: శ్రీ‌లంక ప్ర‌ధాని

చైనా అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని, త‌మ దేశ ప్ర‌యోజ‌నాల‌కు ముప్పు వాటిల్లేలా వ్య‌వ‌హ‌రించొద్ద‌ని హెచ్చ‌రించారు. ఆసియా-ప‌సిఫిక్ ప్రాంతంలోని దేశాలు చైనాకు వ్య‌తిరేకంగా ప‌నిచేసేలా అమెరికా చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌ను మానుకోవాల‌ని అన్నారు. కాగా, ఇండో-ప‌సిఫిక్ ప్రాంతంలో చైనా తీరుపై అమెరికా ఆర్మీ ప‌సిఫిక్ క‌మాండింగ్ జ‌న‌ర‌ల్ చార్లెస్ ఎ.ఫ్లిన్ కూడా ఇటీవ‌లే విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో చైనా ఈ విష‌యంపై కూడా స్పందిస్తూ అమెరికా తీరు స‌రికాద‌ని చెప్పింది. కొన్ని రోజులుగా అమెరికా, చైనా మ‌ధ్య మాటల యుద్ధం పెరుగుతోంది.