Chiranjeevi : ముగిసిన మెగా భేటీ.. టికెట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడనుందా?

సినిమా పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎంతో సమావేశమైన మెగాస్టార్ చిరంజీవి..

Chiranjeevi : ముగిసిన మెగా భేటీ.. టికెట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడనుందా?

Chiru Jagan

Chiranjeevi: ఏపీ ప్రభుత్వానికీ, తెలుగు సినిమా పరిశ్రమకు మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఓ వైపు టికెట్ రేట్ల వివాదం.. మరోవైపు.. కొందరు ప్రజాప్రతినిధులు, టాలీవుడ్ నిర్మాతల మధ్య మాటల యుద్ధం.. ఏపీలో ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీకి మధ్య కాస్త ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది అనే అంతా అనుకున్నారు. కానీ.. ఇటీవల జరిగిన పరిణామాలు అటు ప్రభుత్వానికి ఇటు ఇండస్ట్రీకి మధ్య కాస్త గ్యాప్‌ను పెంచాయి.

Akkineni Nagarjuna: మా సమస్యల పరిష్కారం కోసమే సీఎం దగ్గరకు చిరంజీవి -నాగార్జున
టికెట్ల వ్యవహారంపై ప్రభుత్వ కమిటీ వేసినా.. ఆర్జీవీ మంత్రి పేర్ని నానితో చర్చించినా.. సమస్య పరిష్కారం కాలేదు. ఇదే సమయంలో… హద్దులు దాటిన మాటలు ఏకంగా ఆస్తులపై చర్చ వరకూ వ్యవహారాన్ని తీసుకెళ్లింది. టికెట్ ధరలు పెంచాలని టాలీవుడ్ చిత్ర పరిశ్రమ డిమాండ్ చేస్తుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇలాంటి సమయంలోనే.. దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ రంగంలోకి దిగి.. ట్విట్టర్ వేదికగా జగన్‌ సర్కార్‌‌పై ప్రశ్నలను సంధించారు.. మంత్రితో చర్చించారు. అయినా వివాదం కొలిక్కి రాలేదు. ఇష్యూ రంజుగా సాగుతున్న వేళ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. మరి కొన్ని గంటల్లోనే ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.

Jagan-Chiru : సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ
ఈ సమావేశంలో ఏం చర్చిస్తారు అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు చిరంజీవి జగన్‌తో ఏం చర్చిస్తారు. సినిమా టికెట్లపైనే చర్చిస్తారా.. ఈ సమావేశంతో ఇన్నాళ్లుగా నెలకొన్న వివాదానికి తెర పడుతుందా.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి ట్వీట్ వార్‌కు ఎండ్ కార్డ్ పడుతుందా.. టికెట్ ధరలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా.. సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి రెండు వారాలు టికెట్ల రేట్లు పెరిగే అవకాశం ఉంటుందా.. బెనిఫిట్ షోలకు సర్కార్ సై అంటుందా.. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ఇవాళ్టి సమావేశంతో పరిష్కారం దొరుకుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

వాస్తవంగా.. ‘వకీల్ సాబ్’ సినిమా నుంచి ఏపీలో టిక్కెట్ల వ్యవహారం వివాదంగా మారింది. ఈ విషయంపై ఎగ్జిబిటర్లు కోర్టును సైతం ఆశ్రయించారు. గతంలో పెద్ద సినిమాల విడుదల సమయంలో టిక్కెట్ల ధరలు పెంచుకొనే అవకాశం సాధారణంగా ఇచ్చేవారు. కానీ.. ‘వకీల్ సాబ్‌’ కు ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ తరువాత టికెట్ రేట్లు పెంచుకొనే నిర్ణయాన్ని జేసీల నుంచి తప్పించి..ప్రభుత్వ నిర్ణయం మేరకే అనుమతులు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీవో నెంబర్ 35 రావడంతో… దీనిపైనా వివాదం జరిగింది. ఏపీలో టిక్కెట్ల ధరలను తగ్గించడంపై సినీ పరిశ్రమ నుంచి పలువురు వ్యతిరేకత వ్యక్తం చేశారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా టిక్కెట్ల వివాదంపై సరైన నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలంటూ పలు వేదికలపై ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్.. జగన్ సర్కార్‌ల మధ్య టిక్కెట్ల ధరల వివాదానికి ఎండ్ కార్డ్ వేసేందుకు మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్ కలవబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. టికెట్ల ధరలు పెంచాలని టాలీవుడ్ డిమాండ్ చేస్తున్న సమయంలో చిరంజీవి జగన్‌ను కలవబోతుండటం ఆసక్తి రేపుతోంది. ఈ సమావేశంలో సినిమా టికెట్ల వివాదంపై సీఎం జగన్‌‌తో మెగాస్టార్‌ చిరంజీవి ఏం మాట్లాడతారు.. జగన్‌ ఎలా రియాక్ట్‌ అవుతారన్నది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది..

కట్ చేస్తే.. జగన్‌తో దాదాపు గంటన్నరకు పైగా సినిమా పరిశ్రమలోని పలు అంశాల గురించి చర్చించానని, పండుగ పూట విందుకి ఆహ్వానించి సోదరుడి లాంటి ఆప్యాయత జగన్ చూపించారని మెగాస్టార్ అన్నారు. చిరు, జగన్ సమావేశం గురించి.. అలాగే సినిమా పరిశ్రమకు ప్రభుత్వం అందిచాల్సిన తోడ్పాటు గురించి ప్రముఖ నిర్మాత, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ 10 టీవీతో మాట్లాడారు.