Acharya: చిరు 152వ సినిమా.. 152 థియేటర్లలో ట్రైలర్ ప్రదర్శన!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఆచార్య..

Acharya: చిరు 152వ సినిమా.. 152 థియేటర్లలో ట్రైలర్ ప్రదర్శన!

Acharya (1)

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఆచార్య చిత్రం ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సైరా నరసింహారెడ్డి చిత్రం తరువాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాను చూసేందుకు మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఉన్నారు. గతేడాదిలోనే రిలీజ్ చేయాల్సి ఉండగా, కరోనా కారణంగా ఈ మూవీ వాయిదా పడింది.

Acharya: అన్న కోసం తమ్ముడు.. ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్‌గా పవన్?

దీంతో ఆచార్య చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 29న ఆచార్య చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోండగా.. ప్రమోషన్ కార్యక్రమాలలో స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 12న ఆచార్య ట్రైలర్ విడుదల చేయనున్నారు. మంగళవారం సాయంత్రం 5:49 గంటలకు ట్రైలర్ విడుదల చేయనుండగా.. దీని కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Acharya: ట్రైలర్ టైమ్‌తో దూకుడు పెంచిన ఆచార్య

కాగా, మెగాస్టార్ చిరంజీవికి ఇది 152వ సినిమా కావడంతో ఈ సినిమా ట్రైలర్ ను 152 స్క్రీన్ లలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ట్రైలర్ ప్రదర్శించే అన్ని ప్రాంతాల థియేటర్లకు సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ వెల్లడించింది. చిరంజీవి సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రలో నటిస్తుండటంతో, చిరు-చరణ్ కాంబోలో రాబోయే సీన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ట్రైలర్ ఎలా కట్ చేస్తారో చూడాలి.