CM KCR : పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అక్రమమే.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్ట్ అని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసింది. పోతిరెడ్డిపాడును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు.

CM KCR : పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అక్రమమే.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

Cm Kcr

CM KCR : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింత ముదిరింది. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటికైనా సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు. పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్ట్ అని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసింది. పోతిరెడ్డిపాడును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా అక్రమ ప్రాజెక్టే అని కేసీఆర్ అన్నారు. చట్ట వ్యతిరేకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మిస్తున్నారని ఆరోపించారు.

పర్యావరణ అనుమతులు లేకున్నా, ఎన్జీటీ స్టే ఉన్నా ఏపీ నిర్మిస్తోందని మండిపడ్డారు. ఈ నెల 9న కేఆర్ఎంబీ నిర్వహించనున్న త్రిసభ్య సమావేశాన్ని రద్దు చేయాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ నెల 20 తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ అంశాలను కూడా అజెండాలో చేర్చాలని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ అజెండా అంశాలను కేఆర్ఎంబీకి వెంటనే తెలపాలని నిర్ణయించారు.

జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్నంత కాల విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్న కేసీఆర్.. వద్దని చెప్పే హక్కు కృష్ణా బోర్డుకు లేదని తేల్చి చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు. జల విద్యుత్ పై ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవని కేసీఆర్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాని తిప్పి కొట్టాలని నిర్ణయించారు. జూరాల కుడి, ఎడమ కాల్వాలతో చెరువులు, కుంటలు నింపాలని నిర్ణయించారు. కృష్ణా నీటిలో రెండు రాష్ట్రాలకు 811 టీఎంసీల నికర జలాలు కేటాయించారని, ఏపీ తెలంగాణ 405.5 టీఎంసీలు వాడుకోవాలన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న పరిస్థితుల్లో నీటిపారుదలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక భేటీ నిర్వహించారు. ఇరిగేషన్ అధికారులతోపాటు, వివిధ శాఖ ముఖ్య ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఏపీతో కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌, ఇంజినీర్లు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర హక్కులను కాపాడేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దానిపై ప్రధానంగా చర్చించారు.