Maha Dharna TRS : కేంద్రంతో సమరానికి సై, ఆరంభం…మాత్రమే..అంతం కాదు – సీఎం కేసీఆర్

తెలంగాణ గ్రామగ్రామాల్లో పోరాటాలు కొనసాగుతాయని, తాము చేస్తున్న పోరాటం..ఉధృతమై..ఉప్పెనలా మారుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు.

Maha Dharna TRS : కేంద్రంతో సమరానికి సై, ఆరంభం…మాత్రమే..అంతం కాదు – సీఎం కేసీఆర్

Kcr Speech

CM KCR Speech : వరి కొనుగోళ్లపై కేంద్రంతో సమరానికి సై అంటూ టీఆర్‌ఎస్‌ చేపట్టిన మహా ధర్నా ఇందిరాపార్క్ లో కొనసాగుతోంది. ఈ ధర్నాకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదని తేల్చి చెప్పారు. మన హక్కులు సాధించే వరకు, రైతులకు న్యాయం జరిగే తమ పోరాటం ఆగదు.. మహా ధర్నా ప్రారంభించాక సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. దీంతో కేంద్రంపై పోరుకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. కేంద్రం ద్వంద్వ విధానాలకు నిరసనగా, తెలంగాణ రైతాంగానికి మద్దతుగా ధర్నా చేపట్టామని కేసీఆర్ అన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణకు.. కేంద్రం విధానాలతో దెబ్బతినే అవకాశం ఉందన్నారు.

Read More : NIA Raids in Telugu States : మావోయిస్టు సానుభూతిపరులే టార్గెట్ గా తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు

ఇది ఇక్కడితో ఆగిపోయే యుద్ధం కాదని.. ఉత్తర భారత రైతాంగంతో కలిసి పోరాడతామన్నారు కేసీఆర్. తెలంగాణ గ్రామగ్రామాల్లో పోరాటాలు కొనసాగుతాయని, తాము చేస్తున్న పోరాటం..ఉధృతమై..ఉప్పెనలా మారుతుందని తెలిపారు. కేంద్రం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని కుండబద్ధలు కొట్టారు. నిరంకుశ రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశం, ప్రపంచానికి మన బాధ తెలియాలని, ఉత్తర భారత రైతాంగంతో కలిసి పొరాడుతామని స్పష్టం చేశారు. ప్రజల ప్రయోజనాలను రక్షించేందుకు ఎంతవరకైనా వెళుతామని, తెలంగాణ ఇప్పుడిప్పుడే స్వేచ్చవాయువులు పీల్చుకొంటోందన్నారు.

Read More : Maha Dharna : రైతన్న కోసం..రాజ్ భవన్‌‌కు టీఆర్ఎస్ ర్యాలీ, పాల్గొననున్న సీఎం కేసీఆర్

తెలంగాణ రైతాంగానికి ఆశనపాతంలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని, తాము పనిలేక ధర్నాకు కూర్చొలేదని తెలిపారు. పరిస్థితి విషమించడంతోనే తాము ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ ఒక్కపోరాటామే కాదు..చాలా పోరాటాలున్నాయన్నారు. భవిష్యత్ పోరాటాలపై ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేయడం జరుగుతుందని, ముఖ్యమంత్రులు ధర్నాలు చేయడం కొత్తేమీ కాదని, 2006లో గుజరాత్ సీఎంగా మోదీ 51 గంటలు ధర్నా చేశారనే విషయాన్ని గుర్తు చేశారాయన.

Read More : Heart Touching video : కల్మషం లేని ఈ పసిప్రేమకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే

మరోవైపు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై మండిపడ్డారు. రైతులు రోడ్ల మీదకు వచ్చి… ధర్నాలు చేయడం దురద్రుష్టకరమన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. కేంద్రానికి తన బాధ్యతని తెలంగాణ సీఎం, మంత్రులు గుర్తు చేయడం విచారకరమన్నారాయన. రాజకీయాల కోసం తెలంగాణను అవమానిస్తున్నారని.. రైతుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి జగదీశ్‌రెడ్డి. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని సంక్షేమాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసి చూపించారన్నారు. రాజకీయాల కోసం తెలంగాణను అవమానిస్తున్నారని.. రైతుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి జగదీశ్‌రెడ్డి. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని సంక్షేమాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసి చూపించారన్నారు.