Combinations : అనుకున్నదొక్కటి.. అవుతున్నదొక్కటి.. తెగ ఫీలైపోతున్న డైరెక్టర్స్, ఫ్యాన్స్..

అనుకున్నదొక్కటి.. అవుతున్నదొక్కటి.. స్టోరీలు రెడీ చేసుకుని, బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని అభిమానులకి ఆశ పెట్టి.. సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెంచి, తీరా సెట్స్ మీదకెళ్లే సరికి మొత్తం మార్చేస్తున్నారు డైరెక్టర్లు.. ఈ మధ్య టాలీవుడ్‌లో మిగతా డైరెక్టర్లను డిజప్పాయింట్ చేసిన దర్శకులెవరో చూద్దాం..

Combinations : అనుకున్నదొక్కటి.. అవుతున్నదొక్కటి.. తెగ ఫీలైపోతున్న డైరెక్టర్స్, ఫ్యాన్స్..

Combinations Delay In Tollywood

Combinations: అనుకున్నదొక్కటి.. అవుతున్నదొక్కటి.. స్టోరీలు రెడీ చేసుకుని, బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని అభిమానులకి ఆశ పెట్టి.. సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెంచి, తీరా సెట్స్ మీదకెళ్లే సరికి మొత్తం మార్చేస్తున్నారు డైరెక్టర్లు.. ఈ మధ్య టాలీవుడ్‌లో మిగతా డైరెక్టర్లను డిజప్పాయింట్ చేసిన దర్శకులెవరో చూద్దాం..

టాలీవుడ్‌లో లెక్కలు మారుతున్నాయి. రకరకాల రీజన్స్‌తో సినిమా ఈక్వేషన్స్ చేంజ్ అవుతున్నాయి.. దాంతో ఒకరితో చేద్దామనుకున్న సినిమా మరొకరి చేతిలోకి వెళ్లిపోతోంది. ఈ మధ్య ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు డైరెక్టర్లు.. త్రివిక్రమ్‌తో సినిమా అనౌన్స్ చేసి సంవత్సరం అయిన ఎన్టీఆర్.. ఆ సినిమాకి బ్రేక్ పడడంతో ఇప్పుడు సడెన్‌గా రూట్ మార్చి కొరటాలతో సినిమా అనౌన్స్ చేశారు.

NTR 30

ఆల్రెడీ బన్నీతో సినిమా అనౌన్స్ చేసిన కొరటాల ఇప్పుడు సడెన్‌‌గా ఎన్టీఆర్ సినిమాకి స్విచ్ ఆన్ అయిపోయారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా అయిపోయాక, కొరటాల చిరంజీవితో చేస్తున్న ‘ఆచార్య’ సినిమా కంప్లీట్ చేశాక, కొరటాల సినిమా స్టార్ట్ చేద్దామనుకున్నారు. కానీ ఇక్కడ టైమ్ సింక్ అవ్వకపోవడంతో పాటు స్టోరీలు రెడీగా ఉండడంతో ఈక్వేషన్స్ మారిపోయాయి.

Bunny - Koratala

ఎన్టీఆర్, కొరటాలతో సినిమా అనౌన్స్ చెయ్యడంతో ఆల్రెడీ ఎన్టీఆర్‌తో సినిమా చేద్దామనుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్‌తో సినిమాకి రెడీ అవుతున్నారు. త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్‌కి ఆల్రెడీ క్రేజ్ పీక్స్‌లో ఉండడంతో ఈ సినిమాకి స్పీడప్ చేస్తున్నారు త్రివిక్రమ్.

Mahesh - Trivikram

త్రివిక్రమ్, మహేష్‌తో సినిమా ప్లాన్ చేస్తుండడంతో ఆల్రెడీ మహేష్‌తో సినిమా చేస్తానని చెప్పిన రాజమౌళికి కూడా బ్రేక్ వేశారు కొరటాల. మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత సినిమా పక్కా అని చెప్పిన రాజమౌళికి ఇప్పుడు.. మహేష్ బాబు కొరటాలతో సినిమా చెయ్యడంతో ఈ ఈక్వేషన్ కూడా మారిపోయాయి.

Mahesh - Rajamouli

రాజమౌళికే కాదు.. అనిల్ రావిపూడికి కూడా అదిరిపోయే షాక్ ఇచ్చారు ఎన్టీఆర్ – కొరటాల. ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత మహేష్ బాబు కోసం ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేసిన అనిల్‌కు మహేష్ బాబు ఇప్పుడప్పుడే దొరికే చాన్స్ లేకపోవడంతో బాగా డిజప్పాయింట్ అయ్యినట్టు టాక్. ఇలా టాలీవుడ్‌లో లెక్కలు ఎప్పటికప్పుడు మారిపోవడంతో అనుకున్నదొకటైతే.. ఇంకొక్కటి అవుతుందని డైరెక్టర్లతో పాటు ఆయా హీరోల ఫ్యాన్స్ కూడా తెగ ఫీలయిపోతున్నారున్నారు పాపం..

Mahesh Babu - Anil Ravipudi