Karnataka Polls: 1999, 1989 ఎన్నికల రికార్డులను బద్దలు కొడుతూ ఘన విజయం దిశగా కాంగ్రెస్

ఇప్పటికే పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. పార్టీ అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా మరో ఇద్దరు విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి 43 శాతానికి కాస్త అటుఇటుగా ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా ఈ ఓట్ బ్యాంక్ ఈ నంబర్ వద్దే ఉండేట్లు కనిపిస్తోంది.

Karnataka Polls: 1999, 1989 ఎన్నికల రికార్డులను బద్దలు కొడుతూ ఘన విజయం దిశగా కాంగ్రెస్

Congress Party: కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ఫలితాల్లో కనీవినీ ఎరుగని విజయం వైపుగా దూసుకుపోతోంది. ఒకరకంగా చెప్పాలంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దుమ్ములేపుతోందనే చెప్పాలి. సీట్లు, ఓట్లు.. ఎందులోనూ కాంప్రమైజ్ కాకుండా జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. అయితే ఈ ఎన్నికల్లో గతంలోని రెండు ఎన్నికల్లో సాధించిన రెండు రికార్డులను కాంగ్రెస్ పార్టీ బద్దలు కొట్టింది. ఆ రెండు రికార్డులు కూడా కాంగ్రెస్ పార్టీవే.

Karnataka Polls: సౌత్ ఇండియా నుంచి బీజేపీ ఔట్..! ‘బీజేపీ ముక్త్ సౌత్ ఇండియా’ అంటూ నెట్టింట హవా

కాంగ్రెస్ పార్టీకి 1989లో అత్యధిక ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో 43.76 శాతం ఓట్లను కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఇక 178 సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత ఏ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ 40 శాతం ఓట్లు సాధించలేదు. 34 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ 40 శాతం ఓట్ బ్యాంకును అధిగమించింది. ఇప్పటి వరకు విడుదలైన ఎన్నికల ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీకి 43 శాతానికి కాస్త అటుఇటుగా ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా ఈ ఓట్ బ్యాంక్ ఈ నంబర్ వద్దే ఉండేట్లు కనిపిస్తోంది.

DK Shivakumar : కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ విజయం .. ఎనిమిదోసారి సత్తా చాటిన వొక్కలిగ వారసుడు

ఇక సీట్ల విషయంలో 1999 తర్వాత కాంగ్రెస్ పార్టీ సాధించిన అత్యధిక సీట్లు ఈ ఎన్నికలోనే అని చెప్పాలి (తుది ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది). 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 132 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత ఎప్పుడూ మూడు అంకెల సీట్లకు రాలేదు. అయితే 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 122 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 2018 ఎన్నికల్లో కేవలం 80 సీట్లకే పరిమితం అయిపోయింది. ఇక తాజాగా విడుదలవుతున్న ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 130 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది.

UP Civic Polls: కర్ణాటకలో ఓడినా యూపీలో దుమ్ము లేపుతున్న బీజేపీ

ఇప్పటికే పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. పార్టీ అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా మరో ఇద్దరు విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల ఫలితాల లెక్కింపు పూర్తయ్యే నాటికి ఇవే స్థానాలు కనుక కాంగ్రెస్ సాధించినట్లైతే.. 1999 తర్వాత కాంగ్రెస్ గెలుచుకున్న అత్యధిక స్థానాలు ఇవే అవుతాయి.