Opposition Meet: పాట్నాకు చేరుకున్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలు

జార్ఖండ్ ముఖ్యమంత్రి హెమంత్ సోరెన్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) చీఫ్ సీతారం ఏచూరి సైతం పాట్నాకు చేరుకున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ సైతం పాట్నాకి చేరుకున్నారు

Opposition Meet: పాట్నాకు చేరుకున్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలు

Updated On : June 23, 2023 / 12:00 PM IST

Mallikarjuna Kharge: వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించే లక్ష్యంగా బిహార్ రాజధాని పాట్నా కేంద్రంగా నిర్వహించనున్న విపక్షాల మెగా సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా, ఈ సమావేశానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా కీలక నేత రాహుల్ గాంధీ, ఇతక కాంగ్రెస్ నేతలు పాట్నాకు చేరుకున్నారు. ఎయిర్‭పోర్టుకు చేరుకోగానే వీరిద్దరికీ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇక ఈ సమావేనికి హాజరుకానున్న ఇతర విపక్ష నేతలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా మరికొంత నేతలు బుధవారమే పాట్నా చేరుకున్నారు.

Modi no.1: మళ్లీ మళ్లీ మోదీనే.. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ లీడర్‭గా ప్రధాని మోదీ

జార్ఖండ్ ముఖ్యమంత్రి హెమంత్ సోరెన్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) చీఫ్ సీతారం ఏచూరి సైతం పాట్నాకు చేరుకున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ సైతం పాట్నాకి చేరుకున్నారు. అలాగే సమాజ్‭వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేరుకోగా ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాఘవ్ చద్దా వచ్చారు. అయితే కేజ్రీవాల్ వస్తారా లేదా అనేది తెలియాలి. ఈ సమావేశానికి రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్ జయంత్ చౌదరిని ఆహ్వానించినప్పటికీ.. ఆయనకు కుటుంబ కార్యక్రమం ఉండడం వల్ల హాజరు కావడం లేదని ఆ పార్టీ నాయకుడు ఒకరు స్పష్టం చేశారు.


Opposition Meet: దేవదాస్ సినిమా డైలాగ్ రీమేక్ చేసి రాహుల్ గాంధీపై అదిరిపోయే సెటైర్ వేసిన బీజేపీ

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి దేశంలోని బీజేపీయేతర పక్షాలు హాజరు అవుతున్నాయి. అయితే కొన్ని రాజకీయ పార్టీలు ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. ఇందులో కొన్ని విపక్షాలకు అసలు ఆహ్వానమే అందలేదు. బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, జనతాదళ్ సెక్యూలర్ కీలక నేత కుమారస్వామి, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్‭లను పిలవలేదట.