Kerala: వందే భారత్ రైలుపై పోస్టర్లు అంటించి కాంట్రవర్సీకి కాలు దువ్విన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. పార్టీల మధ్య వైరాన్ని ప్రజా రవాణా మీద చూపించవద్దంటూ ఇతర విపక్ష పార్టీలు విమర్శించాయి. ఇక ఈ పోస్టర్లను గమనించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది.. వెంటనే పలక్కడ్ ఎంపీ పోస్టర్లను తొలగించింది

Kerala: వందే భారత్ రైలుపై పోస్టర్లు అంటించి కాంట్రవర్సీకి కాలు దువ్విన కాంగ్రెస్

Congress MP Posters On Vande Bharat Train

Kerala: 15వ వందేభారత్ ఎక్స్‭ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. ఇది కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి ఉత్తర కేరళ సరిహద్దు పట్టణం కాసర్‭గఢ్ వరకు ప్రయాణిస్తుంది. కేరళలో నడుస్తోన్న మొదటి వందే భారత్ రైలు ఇదే. కాగా, ఈ రైలు ప్రారంభించిన కాసేపటికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూపించిన అత్యుత్సాహంతో కాంట్రవర్సీ నెలకొంది. రైలు తిరువనంతపురం నుంచి బయల్దేరి షోరనూర్ జంక్షన్ స్టేషన్ చేరుకోగానే రైలుపై కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ వీకే శ్రీకందన్ పోస్టర్లు కనిపించాయి. గతంలో వందే భారత్ రైలు మీద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడం లాంటి ఘటనలు జరిగాయి. అయితే ఒక పార్టీకి సంబంధించిన పోస్టర్లు కనిపించడం మాత్రం ఇదే తొలిసారి.

Parkash Singh Badal: సర్పంచ్ నుంచి ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రి వరకు.. అకాలీ చీఫ్ ప్రకాశ్ సింగ్ బాదల్ రాజకీయ జర్నీ

ఇది రాజకీయంగా వివాదస్పదమైంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. పార్టీల మధ్య వైరాన్ని ప్రజా రవాణా మీద చూపించవద్దంటూ ఇతర విపక్ష పార్టీలు విమర్శించాయి. ఇక ఈ పోస్టర్లను గమనించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది.. వెంటనే పలక్కడ్ ఎంపీ పోస్టర్లను తొలగించింది. రైలు షోరనూర్ జంక్షన్‭కు చేరుకునే నాటికి ఎంపీ శ్రీకందన్ సహా ఆయన మద్దతుదారులు రైల్వే స్టేషన్లోనే ఉన్నారు. ఆ సమయంలో ఇవి కనిపించడం మరింత వివాదాస్పదమయ్యాయి. ఈ విషయమై సోషల్ మీడియాలో ఇరు పార్టీ మద్దతుదారుల మధ్య తీవ్ర కొనసాగుతోంది.