T.Congress : డి.శ్రీనివాస్ కొడుకు కూడా కాంగ్రెస్ లో చేరాలి – వీహెచ్

కాంగ్రెస్ పార్టీలో ఉన్న డి. శ్రీనివాస్ అన్ని అనుభవించారని, రెండు సార్లు పీసీసీ పదవిని ఎంజాయ్ చేశారని కామెంట్ చేశారు..

T.Congress : డి.శ్రీనివాస్ కొడుకు కూడా కాంగ్రెస్ లో చేరాలి – వీహెచ్

Vh Hanumantha Rao

VH Hanumantha And D.Srinivas : టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కొడుకు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. పదవీకాలం ముగుస్తోందని..మళ్లీ రాజ్యసభ ఇస్తారో లేదో తెలియదు కనుకే..ఆయన ఆ పార్టీని వీడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా పదవులకు రాజీనామాలు చేసి రావాలని సూచించారు. డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలపై ఆయన స్పందించారు. 2021, డిసెంబర్ 18వ తేదీ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Read More : Madhya Pradesh : విద్యార్థిని ఫిర్యాదు…టాయిలెట్లు కడిగిన మంత్రి

గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న డి. శ్రీనివాస్ అన్ని అనుభవించారని, రెండు సార్లు పీసీసీ పదవిని ఎంజాయ్ చేశారని కామెంట్ చేశారు. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తల నుంచి ఫోన్లు వస్తున్నట్లు…కష్టాల్లో ఉన్న సమయంలో పార్టీని వీడి..ఇప్పుడు మరలా వస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారన్నారు. ఆయన చేరిక వల్ల పార్టీకి ఏమి ఉపయోగమే తనకు అర్థం కావడం లేదన్నారు. గతంలో చేసిన తప్పును సరిదిద్దుకున్నా…తన కుటుంబం కాంగ్రెస్ కుటుంబం అన్నప్పుడు ఆయన కొడుకును కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చాలన్నారు.

Read More : Cryptocurrency: క్రిప్టో కరెన్సీ నిషేధమేనా? ఆర్‌బీఐ ప్రతిపాదన ఇదే.. కేంద్రం ఏం ఆలోచిస్తోంది?

గతంలో కాంగ్రెస్ పార్టీలో డి.శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షులుగా, మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2004లో వైఎస్ హాయంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినా…డీఎస్ ఆ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల క్రమంలో..ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. 2016లో టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. పదవికాలం..ఇంకా ఆరు నెలలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే..గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్..బీజేపీ నుంచి కవితపై పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ తో డీఎస్ కు సత్సంబంధాలు దెబ్బతిన్నాయని అంటుంటారు. ఇటీవలే..కాంగ్రెస్ హై కమాండ్ తో డీ శ్రీనివాస్ చర్చలు జరుపుతున్నారు. కానీ..ఆయన పార్టీలో చేరికపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం వీహెచ్ చేసిన కామెంట్స్ పై ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.