Congress: ఎస్ఐ కాల‌ర్ ప‌ట్టుకున్నందుకు రేణుకా చౌద‌రిపై కేసు

ఎస్ఐ ఉపేంద్ర ఫిర్యాదు మేరకు 353 సెక్ష‌న్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి కాలర్ పట్టుకోవడంపై ఆమెపై ఈ కేసు పెట్టారు. తన విధులకు ఆటంకం కలిగించార‌ని ఎస్ఐ చెప్పారు. 

Congress: ఎస్ఐ కాల‌ర్ ప‌ట్టుకున్నందుకు రేణుకా చౌద‌రిపై కేసు

Renuka Chowdhury

Congress: తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కురాలు రేణుకా చౌదరిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నేష‌న‌ల్ హెరాల్డ్‌కు సంబంధించిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామణీ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఈడీ వ్యవహరిస్తోన్న తీరుకి నిరసనగా త‌మ పార్టీ నేత‌ల‌తో రాజ్ భవన్ ముట్టడికి య‌త్నించిన‌ రేణుకా చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమ‌వ‌గా ఆమె ఎస్సై ఉపేంద్ర కాలర్ పట్టుకున్న విష‌యం తెలిసిందే.

congress: ఎంపీలపై పోలీసులు దాడి చేశారు.. ఆహారం, నీళ్లు ఇవ్వలేదు: ఖర్గే, చిదంబరం

అనంత‌రం ఆమెను అక్క‌డి నుంచి పోలీసులు త‌ర‌లించారు. ఆ తర్వాత ఎస్ఐ ఉపేంద్ర ఫిర్యాదు మేరకు 353 సెక్ష‌న్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి కాలర్ పట్టుకోవడంపై ఆమెపై ఈ కేసు పెట్టారు. తన విధులకు ఆటంకం కలిగించార‌ని ఎస్ఐ చెప్పారు.