Road Accident : సూరారంలో తప్పిన పెనుప్రమాదం

హైదరాబాద్ నగర శివార్లలోని సూరారం చెరువు కట్టపై పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సామగ్రితో వెళ్తున్న ఓ కంటైనర్ కారుపై పడింది.

Road Accident : సూరారంలో తప్పిన పెనుప్రమాదం

Road Accident (4)

Road Accident : హైదరాబాద్ నగర శివార్లలోని సూరారం చెరువు కట్టపై పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సామగ్రితో వెళ్తున్న ఓ కంటైనర్ కారుపై పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దంపతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బుధవారం అర్ధరాత్రి దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

చదవండి : Fire Accident : మల్లాపూర్‌లో అగ్నిప్రమాదం-వ్యక్తి మృతి

కంటైనర్ వేగంగా దూసుకెళ్తున్న సమయంలో విద్యుత్ సామన్ ఓ పక్కకు ఒరిగాయి. దీంతో దానిపక్కనే వెళ్తున్న కారుపై కంటైనర్ పడిపోయింది. ఘటన విషయం తెలుసుకున్న దుండిగల్ పోలీసులు ప్రమాదస్థలిలోకి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

చదవండి : Accident : ఘోరం… ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

కంటైనర్ ను రోడ్డుపక్కకు తీశారు. అయితే ప్రమాదం సమయంలో లారీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు నిర్దారించారు. అతడిని అదుపులోకి తీసుకోని ప్రశ్నిస్తున్నారు.