Coromandel Express derails: కోరమాండల్ రైలు ప్రమాద ఘటన.. 50మంది మృతి, రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్లు

Coromandel Express derails: ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లు విచారం వ్యక్తం చేశారు.

Coromandel Express derails: కోరమాండల్ రైలు ప్రమాద ఘటన.. 50మంది మృతి, రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్లు

Coromandel Express

Coromandel train accident incident:  రైలు నంబర్ 12841 షాలిమార్ – చెన్నై కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో 50 మంది దాకా మరణించారని, మరో 300 మందికి పైగా గాయపడ్డారని అధికారులు చెపుతున్నారు. 7 బోగీలు బోల్తా పడటంతో వాటి కింద ప్రయాణికులు చిక్కుకున్నారని స్థానికులు చెబుతున్నారు.

ఈ ప్రమాద ఘటన అనంతరం పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లు విచారం వ్యక్తం చేశారు.

50 అంబులెన్సులు, బస్సులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలను సంఘటన స్థలానికి పంపించారు. ఒడిశాలో వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించేందుకు సిద్ధం చేశారు.

ఈ ఘటన నేపథ్యంలో సౌత్ ఈస్ట్రన్ రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నంబర్లను వెల్లడించారు.
హౌరా హెల్ప్‌లైన్ నంబర్ : 03326382217
ఖరగ్ పూర్ హెల్ప్‌లైన్ నంబర్ : 89720 73925, 93323 92339
బాలాసోర్ హెల్ప్‌లైన్ నంబర్: 82495 91559, 79784 18322
షాలిమార్ హెల్ప్‌లైన్ నంబర్: 99033 70746